సోనూసూద్ ఆ వీడియోతో నెటిజన్లు షాక్ .. ఇదేం పని అంటూ రివర్స్ ఎటాక్!!
సోను సూద్... రీల్ లైఫ్ విలన్... రియల్ లైఫ్ హీరో గా కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సహాయం చేసి పెద్ద మనసు చాటుకున్న దేవుడిగా గుర్తింపు పొందాడు. బాలీవుడ్ నటుడు అయిన సోనుసూద్ అప్పట్లో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచారు. కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ విధించిన సమయంలో, వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులను చేరడం కోసం సోను సూద్ చేసిన సేవ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

సోనూసూద్ తాజాగా చేసిన పనితో ఆయనపై విమర్శల వెల్లువ
కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేసిన సోనుసూద్ వారి పాలిట దేవుడిగా మారారు. అడిగిన వారికి లేదనకుండా, కాదనకుండా సహాయం చేసి ఆయన గొప్ప మానవతా మూర్తి గా నిలిచారు. సోను సూద్ పై అభిమానంతో చాలా మంది వారి పిల్లలకు సోను సూద్ పేరు పెట్టుకున్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి సోను సూద్ తాజాగా చేసిన ఒక పని నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

కదులుతున్న రైల్లో ఫుట్ బోర్డ్ దగ్గర కూర్చుని వీడియో
సోనూసూద్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సోనుసూద్ రైల్లో ఫుట్ పాత్ పై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించారు. ఈ నెల 13వ తేదీన సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ లో హ్యాండ్ రైలు పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున తన కాలి ముని వేళ్ళ పై మాత్రమే కూర్చుని రైలు నుంచి బయటకు చూస్తూ సోనూసూద్ కనిపించారు. 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన సోనూసూద్ అభిమానులందరూ ఆయనపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సోనూ సూద్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు .. రకరకాల సలహాలు
కదులుతున్న రైలు డోర్ దగ్గర కేవలం మునివేళ్ల మీద కూర్చొని బయటకు చూడటం అత్యంత ప్రమాదకరమని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మందికి రోల్ మోడల్ అయిన మీరు ఇలా ఉంటే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వారు ఏం చేస్తారో అంటూ కొందరు సోనూసూద్ ను టార్గెట్ చేస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శ నీయులైన మీరు ఇటువంటివి చేయడం మంచిది కాదని సలహాలిస్తున్నారు. ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అంటున్నారు.

అదేం పని అంటూ సోషల్ మీడియాలో విమర్శలు
ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడిగా, మరియు సామాజిక వేత్త గా మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యువత ఇదే విధంగా చేస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ప్రస్తుతం సోనూసూద్ చేసిన వీడియో పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది .ఎవరికి వారు తమదైన శైలిలో ఇది మంచి పని కాదు అంటూ సోనూసూద్ ను విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications