Privet Trian: పట్టాలపైకి ప్రైవేట్ ట్రైన్.. ఎప్పుడంటే..!
భారతీయ రైల్వేలో త్వరలో కీలక మార్పు రానుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ ట్రైన్ పట్టాలెక్కనుంది. వివిధ వార్త కథనాల ప్రకారం జూన్ 4న ప్రైవేట్ ట్రైన్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రైవేటు రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు ప్రయాణం చేయనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహించనుంది.
భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును ప్రవేశపెట్టనున్నారు. ఎస్ఆర్ఎంపీఆర్ కేరళలో పర్యాటక కార్యకలాపాల కోసం ఒక రైలును లీజుకు తీసుకుంది. ఈ ట్రైన్ ను ప్రిన్సి ట్రావెల్స్ టికెటింగ్, మార్కెటింగ్‌ను పర్యవేక్షించనుంది.

తిరువనంత పురంలో స్టార్ట్ అయ్యే ఈ రైలు త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది..ఈ ప్రైవేట్ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైల్లో ఒకేసారి 750 మంది ప్రయాణించ వచ్చు. రైలు ప్రయాణం కార్యకలాపాలను నిర్వహించడానికి, వైద్య నిపుణులతో సహా 60 మంది సిబ్బందితో కూడిన బృందం ఉంటుందని తెలుస్తోంది.
ఈ రైలులో ఆహారం, Wi-Fi, GPS ట్రాకింగ్ కూడా సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. స్టార్ హోటల్ బసలు, భోజనాలు, సందర్శనా అవకాశాలను అందించే టూర్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. నాన్-ఎసి స్లీపర్‌లో గోవాకు 4-రోజుల ట్రిప్‌కు ఛార్జీలు రూ.13,999 నుంచి ప్రారంభమవుతాయని, 3-టైర్ AC లేదా 2-టైర్ ACని ఎంచుకునే వారి ధర తదనుగుణంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications