రాజ్యసభలో సింహాన్ని చూడబోతున్నాం: సుబ్రహ్మణ్యస్వామి
రాజ్యసభలో సింహాన్ని చూడబోతున్నామని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును పలువురు అభినందించారు.
న్యూఢిల్లీ: రాజ్యసభలో సింహాన్ని చూడబోతున్నామని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును పలువురు అభినందించారు.
ఆయనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత ఆజాద్, జేడీయూ నేత శరద్ పవర్, వామపక్ష నేత రాజా అభినందనలు తెలిపారు. వెంకయ్య అయితే రాజ్యసభను హుందాగా నడిపిస్తారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు.

వెంకయ్య ఉప రాష్ట్రపతి అయితే తెలుగువారికి గర్వకారణమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యపేరు దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం.
అయితే వెంకయ్య నాయుడు మాత్రం ఉపరాష్ట్రపతి పదవిపై తనకు మోజు లేదన్నారు. పెళ్లి కాకముందే పిల్లగాడికి పేరు పెడితే ఎలా? అని తనను అభినందించే వారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాను క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications