నిబంధనలు అతిక్రమిస్తే శిక్షలు, విమానం ఎక్కాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరి
దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించాలన్నా పాస్ పోర్ట్ వివరాలను తెలపాల్సిందే. పాస్ పోర్ట్ లేకుంటే ఆధార్ కార్డు వివరాలను అందించాల్సిందే.
న్యూఢిల్లీ:దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించాలన్నా పాస్ పోర్ట్ వివరాలను తెలపాల్సిందే. పాస్ పోర్ట్ లేకుంటే ఆధార్ కార్డు వివరాలను అందించాల్సిందే. ఈ మేరకు భారత పౌర విమానాయాన శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
భారత పౌర విమానాయాన సంస్థ కీలక మార్పులు చేయాలని బావిస్తోంది. దేశంలో ఎక్కడికి విమానాల్లో ప్రయాణం చేయాలంటే పాస్ పోర్ట్ లేదా ఆధార్ ను ఇవ్వాల్సిందే.
ఈ మేరకు సివిల్ ఏవియేషన్ రిక్వైర్ మెంట్ ముసాయిదాను ఇప్పటికే సిద్దం చేశారు. వచ్చే వారం దానిని ప్రజల ముందుకు తీసుకురానున్నారు.

నెల రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విధానాన్ని మూడు లేదా నాలుగు నెలల్లో అమలు చేసేందుకుగాను ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాల్లో ప్రయాణిస్తూ నిబంధనలను అతిక్రమించేవారికి నాలుగు స్థాయిల్లో వారు చేసిన పనిని బట్టి శిక్షను అమలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తప్పిదాలకు పాల్పడిన వారి పూర్తివివరాలు తెలుసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ముందస్తుగా టిక్కెట్ బుకింగ్ చేసుకొనే సమయంలో పాస్ పోర్ట్ , ఆధార్ ను తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేందుకు ఈ నిబంధన అమల్లో ఉంది.












Click it and Unblock the Notifications