సారీ మెస్సీ..! సాకర్ గ్రేట్ కు మమతా బెనర్జీ క్షమాపణలు..!
సాకర్ గ్రేట్ లయోనల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా పలు నగరాల్లో పర్యటిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇవాళ కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ మ్యాచ్ ఆడకుండానే కేవలం 10 నిమిషాల్లో అక్కడికి వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. దీనిపై ఆగ్రహించిన స్థానిక సాకర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. స్టేడియంలో వాటర్ బాటిల్స్ విసిరి రచ్చ చేశారు. దీంతో భారత్ పరువుపోయినట్లయింది.
ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రత్యేక బలగాల్ని రంగంలోకి దింపి ఇందుకు కారకులైన వారిని గుర్తించేందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అలాగే లయోనల్ మెస్సీని బహిరంగంగా క్షమాపణలు కోరారు. సాల్ట్ లేక్ స్టేడియంలో ఇవాళ జరిగిన నిర్వహణ లోపం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ ఓ ట్వీట్ కూడా చేశారు.

ఈ దురదృష్టకర సంఘటనకు లియోనెల్ మెస్సీకి, అలాగే క్రీడా ప్రియులందరికీ, అతని అభిమానులందరికీ తాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి స్టేడియానికి వెళ్తున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అలాగే ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, ఉన్నతాధికారులతో కూడిన కమిటీ సమగ్ర దర్యాప్తు చేపడుతుందని మమత ప్రకటించారు.

I am deeply disturbed and shocked by the mismanagement witnessed today at Salt Lake Stadium. I was on my way to the stadium to attend the event along with thousands of sports lovers and fans who had gathered to catch a glimpse of their favourite footballer, Lionel Messi.
— Mamata Banerjee (@MamataOfficial) December 13, 2025
I…
రిటైర్డ్ జస్టిస్ ఆశిమ్ కుమార్ రే అధ్యక్షతన తాను ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని, ఇందులో ప్రధాన కార్యదర్శి , హోం వ్యవహారాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉన్నారని మమత వెల్లడించారు. ఈ కమిటీ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యుల్ని గుర్తిస్తుందన్నారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి చర్యలను సిఫార్సు చేస్తుందని మమత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications