50 శాతం పాజిటివ్ కేసులపై క్లారిటీ లేదు, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌పై సందేహాలు, డీడీఎంఏ భేటీ...
ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీనిని కేంద్రం ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. అయితే దేశ రాజధానిలో రికార్డవుతోన్న 50 శాతం పాజిటివ్ కేసులు ఏలా వ్యాపిస్తున్నాయో తెలియడం లేదన్నారు. 50 శాతం కేసులు వ్యాప్తిపై స్పష్టత లేకపోవడం.. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరుగుతోందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
ఢిల్లీలో వైరస్ వ్యాప్తి గురించి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరుగుతోందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని తాము డీడీఎంఏ సమావేశంలో లేవనెత్తుతామని పేర్కొన్నారు. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో స్పష్టత లేదు. చాలా కేసుల్లో వైరస్ ఎలా వచ్చింది తెలియరాలేదు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వమే ప్రకటించాలని రణదీప్ గులేరియా, సత్యేంద్ర జైన్ అంటున్నారు. ఒకవేళ కమ్యునిటీ స్ప్రెడ్ జరిగితే.. ఆ ప్రాంతంలో వైరస్ మూడో స్టేజీలోకి చేరినట్టే అవుతోంది.

వాస్తవానికి ఢిల్లీలో విమానాల రాకపోకలు వద్దని.. ముఖ్యంగా ల్యాండ్ చేయొద్దని కేంద్రానికి విన్నవించినా పట్టించుకోలేదని సత్యేంద్ర జైన్ తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఢిల్లీలోనే ఉన్నారని గుర్తుచేశారు. లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన డీడీఎంఏ సమావేశం జరుగుతోంది. సమావేశంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ తదితర అధికారులు పాల్గొంటారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications