విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రజలకు శుభవార్త
విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతీయ రైళ్లు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక రైళ్లను విజయవాడ మీదగా నడుపుతున్నారు.
06285 06286 బెంగళూరు-సంత్రాగచి-బెంగళూరు రైలు ఈనెల21 తెల్లవారుజామున రెండు గంటలకు బెంగళూరులో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 11.10 గంటలకు సంతాగచి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 23న సంత్రాగచిలో మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు రాత్రి 10.00 గంటలకు బెంగళూరు చేరుతుంది. కృష్ణరాజపురం, జోలార్ పేట, కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

06073 06074 చెన్నై-భువనేశ్వర్-చెన్నై ఈనెల 23, 24, 30, 31, నవంబరు 6, 7 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతరోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు భువనేశ్వర్ లో రాత్రి 9.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్ స్టేషన్లలో ఆగుతుంది.
06071 06072 రైలు ఈనెల 21, 23, 28, 30, నవంబరు 4, 6 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి తర్వాతరోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచిలో ఉదయం 5.00 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 11.00 గంటలకు చెన్నై చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయగనరం, పలాస, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.












Click it and Unblock the Notifications