ఎన్నికల కోసం రూ. 2,107 కోట్లు నీళ్ల పాలు

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రజలకు న్యాయం చేస్తామని పైకి చెప్పే రాజకీయ నాయకులు వారి ఎన్నికల సమయంలో చేసే ఖర్చు చూసి ఎన్నికల అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో పరిమితికి మించి రూ. కోట్లు ఖర్చు చెయ్యరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నికల కమీషన్ ఆదేశాలు సైతం లెక్క చెయ్యకుండా మా పార్టీ ఇంత మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేసిందని వారికి లెక్కలు చూపించడమే కాకుండా చుక్కలు చూపించారు. ఎన్నికల కమీషన్ తో పాటు భారతదేశానికి ఉన్న ప్రత్యేకతను పరిహాసం చేస్తున్న పార్టీల గురించి వెలుగు చూసింది.

హంగులు, ఆర్భాటాలతో తమ పార్టీ ప్రాచారాన్ని అన్ని విధాలుగా చేశారు. అందుకు రూ. కోట్లు ఖర్చు పెట్టామని లెక్కలు చూపించారు. ఆ రాజకీయ పార్టీలు గురించి ప్రజలకు తెలియాలి. దేశంలోని వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీలు 2004 నుంచి 2015 వరకు జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఈసీకి సమాచారాన్ని ఇచ్చారు.

SP, AAP, AIADMK top the maximum expenditure during Lok Sabha elections

ఈ నివేదికను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ (ఏడీఆర్) ప్రజలకు కళ్లు చెదిరే వాస్తవాలను ముందుకు తీసుకు వచ్చింది.2004 నుంచి 2015 వరకు జరిగిన మొత్తం ఎన్నికల్లో మన రాజకీయ పార్టీలు అన్నీ కలిపి కేవలం ప్రచారం కోసం రూ. 2,107 కోట్లు ఖర్చు చేశాయని స్పష్టం చేసింది.

మూడు సార్లు జరిగిన లోక్ సభ ఎన్నికల కోసం విరాళాలుగా చెక్కుల రూపంలో ఆ పార్టీలకు మొత్తం రూ. 1,300 కోట్లు, నగదు రూపంలో రూ. 1,039 కోట్లు చేరింది. వీటిలో ప్రాంతీయ పార్టీ లైన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అన్నా డీఎంకే, భారతీయ జనతాదళ్ (బీజేడీ) అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం లోక్ సభ ఎన్నికల సందర్బంగా మొత్తం రూ. 267 కోట్లు విరాళాలు సేకరించారు.

అందులో సమాజ్ వాదీ పార్టీ రూ. 118 కోట్లు విరాళాలు సేకరించి మొదటి స్థానంలో నిలిచింది. కేవలం 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల కోసం ఆప్ రూ. 51.83 కోట్లు విరాళంగా తీసుకుంది. అందులో రూ. 37.66 కోట్లు ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు అయ్యిందని ఈసీకి లెక్కలు చూపించారు.

ఈసీ నియమాల ప్రకారం ఎన్నికల ప్రచారం ఖర్చు రూ. 20 వేల కంటే ఎక్కువ ఖర్చు చెయ్యరాదని నియమాలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలకు అందించే ఫార్మెట్ లో ప్రచార ఖర్చుకు సంబంధించి ఎటువంటి నియమాలు లేవని ఏడీఆర్ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+