వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MP crisis: కాంగ్రెస్‌కు షాకిచ్చిన 22 మంది ఎమ్మెల్యేలు, ఎస్పీ, బీఎస్పీ కూడా బీజేపీకే ‘జై’

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలన సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న రెబల్ ఎమ్మెల్యేల సంంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలంతా సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమవుతోంది.

Recommended Video

MP Political Crisis : 21 Congress MLAs Resign | Jyotiraditya Scindia Holi Gift To BJP | Oneindia
కాంగ్రెస్‌కు షాకిచ్చిన 22 మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌కు షాకిచ్చిన 22 మంది ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా మరో 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం దాదాపు కూలిపోయినట్లయింది.

బీజేపీకే జై కొట్టిన ఎస్పీ, బీఎస్పీ..

బీజేపీకే జై కొట్టిన ఎస్పీ, బీఎస్పీ..

అయితే, ఇప్పటి వరకు కమల్ నాథ్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా తాజాగా బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి మద్దతు పలకడం సంచలనంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్ శుక్లా, ఎమ్మెల్యే సంజీవ్ కుశ్వాహా మంగళవారం మధ్యాహ్నం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. దీంతో ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈ ఎమ్మెల్యేల భేటీపై చౌహాన్ స్పందిస్తూ.. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదనీ, కేవలం హోళీ పండగను పురస్కరించుకుని ఆ ఎమ్మెల్యేలు తనను కలిశారని చౌహాన్ చెప్పారు.

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే..

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే..

మరోవైపు కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే బిసాహు లాల్ సింగ్ మంగళవారం బీజేపీలో చేరారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, అందుకే పార్టీని, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు లాల్ సింగ్ తెలిపారు.

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు ఆగవు..

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు ఆగవు..

అంతేగాక, త్వరలోనే మరింత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి, బీజేపీలో చేరతారని స్పస్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం గమనార్హం.

English summary
There is no politics in it, SP, BSP MLAs met me for Holi: Shivraj Singh Chouhan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X