వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో లెక్కలు సరిచేస్తా.. బీజేపీ 20, ఎస్పీకి 80 శాతం స్థానాలు.. యోగికి అఖిలేష్ చురకలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరింత దూకుడు పెంచారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రోజుకోకరు కాషాయ పార్టీకి వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇక సైకిల్ స్పీడ్‌ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాము 400 సీట్లు గెలుచుకుంటామని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

 బీజేపీ కలలు కలలుగానే..

బీజేపీ కలలు కలలుగానే..

యూపీలో బీజేపీ కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో 80 శాతం మంది ఒకవైపు, 20 శాతం మంది మరొక వైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ, వారి అంచనాలు తల్లకిందులు కావడం ఖాయమని అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. బాహుశా యోగి మాట‌ల్లో బీజేపీకి 20 శాతం స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీకి 80 శాతం స్థానాలు లభిస్తాయనేది సారాంశం కావచ్చని సైటైర్లు వేశారు. సీఎం యోగి ఓ లెక్కల మాస్టారును నియమించుకోంటే బాగుంటుందని ఎద్దేవాచేశారు. ఇటీవల బీజేపీ రాజీనామా చేసిన ప్రసాద్‌ స్వామి మౌర్య, ధరంసింగ్‌తో సహా ఇతర బిజెపి ఎమ్మెల్యేలు అఖిలేష్‌ సమక్షంలో సమాజ్‌వాదీలో చేరారు.

సైకిల్ స్పీడ్‌కు త‌ట్టుకోలేరు..

సైకిల్ స్పీడ్‌కు త‌ట్టుకోలేరు..

సమాజ్‌వాదీ పార్టీ స్పీడ్‌ను బీజేపీ త‌ట్టుకోలేద‌న్నారు అఖిలేష్ . త‌మ సైకిల్ హ్యాండిల్, చక్రాలు చాలా సరిగ్గానే ఉన్నాయి. ఫైడల్ తొక్కే వ్యక్తి కూడా వచ్చేశారు. దీనిపై సపారీ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అంబేద్కర్ వాదులు, సమాజ్ వాదీలు ఏకమయ్యాం. ఇక తమను ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తామంతా అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం దివాళా తీసిందని విమర్శలు గుప్పించారు. పెట్రో, డీజిల్‌ ధరలతోపాటు నిత్యావసరాలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని అఖిలేఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాు.

 యోగికి ఆట ఆడడం రావడం లేదు..

యోగికి ఆట ఆడడం రావడం లేదు..

బీజేపీ ఓటమి భయపట్టకుందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ నుంచి రోజుకొకరు వీడుతున్నారని అన్నారు. అయితే సీఎం యోగికి మాత్రం ఆట ఆడడం రావట్లేదు. ఆట తెలిసి కూడా క్యాచ్ పట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. యూపీలో సమాజ్ వాదీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే యోగి గోరఖ్ పూర్ వెళ్లిపోయారని సెటర్లు వేశారు. మకర సంక్రాంతి తర్వాత బీజేపీ పని అయిపోయిందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు కుంభకర్ణుడిలా నిద్ర పోయి యోగి ఇప్పుడు మేల్కొన్నారని విమర్శలు గుప్పించారు.

English summary
SP Chief Akhilesh Yadav Satires on UP CM Yogi Adityanath
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X