Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీలో మహిళలకు రక్షణ కరువు.. బాబా సీఎంను సాగనంపాల్సిందే : అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ బరితంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్షాల మధ్య మాటల దాడి పెరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ పాలనలో అమాయకులు బలవుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

 అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా యూపీ..

అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా యూపీ..

యూపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారిందని విమర్శించారు. మూడో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలౌన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.

 మ‌హిళ‌ల‌కు ర‌క్షణ క‌రువు

మ‌హిళ‌ల‌కు ర‌క్షణ క‌రువు


గణంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా నిలిచిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. రెండు రోజుల కిందట ఓ బాలిక తప్పిపోయింది. ఈ రోజు ఆ చిన్నారి శవమై కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపానికి ఎవరు బాధ్యతవహిస్తారని నిలదీశారు. బాబా ముఖ్యమంత్రి బాధ్యతవహిస్తారా అని సీఎం యోగిని ఉద్దేశించి ప్రశ్నించారు.

Recommended Video

    Uttar Pradesh Elections 2022 :'Come Out And Vote' - Rahul Gandhi | Oneindia Telugu
     రైతుల భూముల‌పై బీజేపీ క‌న్ను

    రైతుల భూముల‌పై బీజేపీ క‌న్ను

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిందని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి వ్యతిరేకంగా పోరాడిన 750 మంది రైతులు మృతి చెందారని పేర్కొన్నారు. ఇంతమంది రైతుల చావుకు బీజేపీయే కారణమని మండిపడ్డారు. మరోసారి రాష్ట్రంలో కాషాయ పార్టీ అధికారంలో వస్తే న‌ల్ల చట్టాలను మరోసారి తీసుకొచ్చి మీ భూములను అమ్ముకుంటుందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ ఆ పార్టీని రైతులు నమ్మడం లేదని అఖిలేష్ విమర్శించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+