స్పీకర్‌పై విమర్శ, ప్లకార్డు పట్టి పోడియం వద్దకి రాహుల్
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం లోకసభ స్పీకర్ పైన ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. స్పీకర్ బీజేపీ వైపు పక్షపాతం చూపిస్తున్నారన్నారు. బుధవారం లోకసభ ప్రారంభం అయింది.
మతఘర్షణల పైన లోకసభలో చర్చకు కాంగ్రెసు పార్టీ పట్టు బట్టింది. అయితే, మత ఘర్షణల పైన చర్చకు తాము సిద్ధమని సభలో వెంకయ్య నాయుడు ప్రకటించారు. అయితే, విపక్షాలు నోటీసులు ఇస్తే స్పందిస్తామని చెప్పారు.

మరోవైపు, అంతకుముందు రాహుల్ గాంధీ ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి చొచ్చుకు పోయారు. మతఘర్షణల పైన చర్చకు కాంగ్రెసు పార్టీ పట్టుబట్టింది. చర్చకు పట్టుబట్టిన కాంగ్రెసు సభ్యులు ప్లకార్డులు పట్టుకొని పోడియం వైపుకు చొచ్చుకుపోయారు. వారికి రాహుల్ గాంధీ కూడా జతకలిశారు.












Click it and Unblock the Notifications