మహా అసెంబ్లీ సమావేశం: ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేడే: 28 సాయంత్రం 6.40 కి సీఎంగా ఉద్దవ్ ప్రమాణం
మహా రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. పట్టుమని మూడు రోజులు కూడా కాకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యకుండానే మహా ప్రభుత్వం కుప్ప కూలింది. బీజేపీ నాడు కర్ణాటక తరహాలో ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇక నేడు సుప్రీం ఆదేశాల మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి బుధవారం శాసనసభ ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికారు. కొత్తగా ఎన్నికైన 288 మంది సభ్యులకు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు రేపు సీఎం గా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారు.

మహారాష్ట్ర ప్రత్యేక శాసనసభ నేడు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న శాసనసభ్యులు
ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో కొత్తగా నియమించబడిన ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కోలాంబ్కర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.బుధవారం బల పరీక్షకు ఆదేశించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ప్రొటెం స్పీకర్ గా కోలంబ్కర్‌ను నియమించారు. కానీ అనూహ్యంగా రాజకీయం మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల కారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒక నెలగడిచినా ఇప్పటి వరకు శాసన సభ్యులుగా కూడా ప్రమాణం చేయలేకపోయారు. ఇక నేడు వారు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

నేడు సుప్రీం ఆదేశాల మేరకు శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం
ఎన్నికల తర్వాత ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని, అసెంబ్లీని ఏర్పాటు చేయలేకపోవటం తో నవంబర్ 12 నుంచి నవంబర్ 23 మధ్య 13 రోజుల పాటు రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది.ఆ తర్వాత ఊహించని రాజకీయ పరిణామాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. పరీక్ష రాయక ముందే ఫెయిల్ అయ్యింది. ఇక నేడు శాసన సభలో ఎన్నికైన సభ్యులందరూ బుధవారం సాయంత్రం 5:00 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని సుప్రీం ఆదేశించటంతో శాసన సభ జరగనుంది.

మహా వికాస్ అఘాడి ప్రభుత్వ ఏర్పాటును కోరుతూ గవర్నర్ కు లేఖ ఇచ్చిన కూటమి పార్టీలు
శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో కూడిన 'మహా వికాస్ అఘాడి' సోమవారం 162 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌కు లేఖను సమర్పించింది.అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేయడంతో బిజెపి మెజారిటీ కోల్పోయినందున తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించటంతో బీజేపీ ప్రభుత్వ చాప్టర్ క్లోజ్ అయ్యింది. అయినప్పటికీ నేడు శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.

ముఖ్యమంత్రిగా శివసేన నేత ఉద్దవ్ థాక్రే.. 28 సాయంత్రం 6.40 కి ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన నేత ఉద్దవ్ థాక్రే ఉంటారని ఎన్‌సిపి ప్రకటించింది.మెజారిటీ మద్దతు చూపించుకోవటానికి ఉద్ధవ్ థాక్రే కు మహారాష్ట్ర గవర్నర్ డిసెంబర్ 3 వరకు సమయం ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే గానూ , ఎమ్మెల్సీ గానూ లేని కారణంగా గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేకు అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఇస్తారు. ఉద్ధవ్ ఠాక్రే గురువారం మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు .ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 28 సాయంత్రం 6.40 గంటలకు జరుగుతుంది, గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖ ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు .












Click it and Unblock the Notifications