యూపీ ఎన్నికల ప్రచార సిత్రాలు-దుర్గా శ్లోకాలు, భోజ్ పురి ర్యాప్ పాటలు-శ్రీలంక మెలోడీ గీతాలు
హోరాహోరీగా సాగుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు పాటలు, మ్యూజిక్, శ్లోకాలు.. ఇలా విన్నూన్న పద్ధతుల్ని ఎంచుకుంటున్నాయి. దీంతో ఓటర్లు కూడా వీటికి ఆకర్షితులవుతున్నారు.
శ్రీలంక సింగర్ యోహానీ , ఛత్తీస్‌గఢ్ చైల్డ్ ఆర్టిస్ట్ సహదేవ్ డిర్డో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వంలో తమదైన శైలిలో పాటలతో ఆకర్షిస్తున్నారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం గతేడాది వైరల్ హిట్‌లు అయిన మానికే మాగే హితే , బచ్‌పన్ కా ప్యార్ ట్యూన్‌లో తన ప్రచార పాటలను సెట్ చేయడం ద్వారా తమకు అనుకూలంగా ప్రజలు ఓటు వేసేలా ప్రభావితం చేయగలదని అంచనా వేసుకుంటోంది. కోవిడ్-19 ముప్పు కారణంగా ఎన్నికల సంఘం పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో భౌతిక ర్యాలీలను నిషేధించడంతో, పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి అన్ని ఇతర మార్గాలను ప్రయత్నిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో, ప్రచార పాటలు పూర్తిస్థాయి యుద్ధంగా ఉన్నాయి, ఇప్పటివరకు బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ప్రచారంలో పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.

ఖాదీ బోలి, అవధి, భోజ్‌పురి వంటి యూపీలో మాట్లాడే వివిధ డైలాగ్‌లతో రెండు పార్టీలు అనేక పాటలను తయారు చేశాయి. దీంతో ఇతర పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీ కూడా వారి ప్రచారాల్లో పాటల్ని చొప్పిస్తున్నాయి. ఈ పాటల ద్వారా తాము ప్రత్యర్ధులపై విసరాలనుకున్న వాగ్బాణాలను కూడా కవర్ చేసేస్తున్నాయి. దీంతో పాటు తమకు అధికారం ఎందుకు ఇవ్వాలో కూడా ఇందులోనే చెప్పేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీలో అఖిలేష్ యాదవ్ ఎక్కువగా దర్శనమిస్తుండగా.. బీజేపీ వీడియోల్లో మాత్రం ఇది మోడీ-యోగీ సర్కార్ అంటూ ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications