Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.888 నుంచే విమాన టికెట్లు: స్పైస్‌జెట్ పండగ ఆఫర్

న్యూఢిల్లీ: దీపావళి, సంక్రాంతి పండగలను పురస్కరించుకుని దేశీయ విమాన సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఇండిగో సంస్థ దేశీయ ప్రయాణాలకు తమ విమాన టికెట్ల ధరలు రూ.899 నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, స్పైస్‌జెట్‌ కూడా అలాంటి ఆఫర్‌నే ప్రవేశపెట్టింది.

SpiceJet Offers Domestic Flight Tickets From 888 Rupees In Festive Season Sale

కేవలం రూ.888 నుంచే డొమెస్టిక్‌ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య చేసే దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, టిక్కెట్‌ బుక్‌ చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబరు 28 అని పేర్కొంది.

కాగా, దేశీయ విమాన రంగం 2025 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపణిగా అవతరించనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ లెక్కల ప్రకారం.. ఏటా సగటున 21.2 శాతం మంది విమాన ప్రయాణికులు పెరుగుతుండటం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+