భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లపై కేంద్రం కీలక ప్రకటన- రెగ్యులర్ మ్యాచ్ లు అప్పుడే..
ఒకప్పుడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులు పడిచచ్చే పరిస్దితి. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి చాలా మేరకు తగ్గిపోయింది. దీనికి కారణం ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు బాగా తగ్గిపోవడమే. దీనికి కారణం పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరే. తాజాగా ఆసియాకప్ లోనూ భారత్ ఆడే మ్యాచ్ లు ఆతిధ్య దేశం పాకిస్తాన్ లో కాకుండా తటస్ధ వేదిక అయిన శ్రీలంకలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం భారత్-పాక్ మ్యాచ్ లపై కీలక ప్రకటన చేసింది.
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు. కేవలం ముక్కోణపు లేదా బహుళ జట్లు పాల్గొంటున్న టోర్నీల్లో మాత్రమే భారత్ పాకిస్తాన్ తో ఆడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పునరుద్ధరిస్తారన్న ప్రశ్నకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, భారత్‌లో చొరబాట్లను అరికట్టే వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ ఉండదని బీసీసీఐ చాలా కాలం క్రితమే నిర్ణయించిందని ఠాకూర్ తెలిపారు.

ఐసీసీ, విదేశీ ఈవెంట్‌లలో రెండు జట్లు మాత్రమే మ్యాచ్‌లు ఆడటంతో రెండు పొరుగు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారతదేశం ,పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు సంవత్సరాలుగా నిలిపివేశారు. క్రీడల విషయానికొస్తే, చొరబాట్లు ,సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు నిర్వహించకూడదని బీసీసీఐ చాలాకాలం క్రితమే నిర్ణయించిందన్నారు.ఇది ఈ దేశంలోని ప్రతి సాధారణ పౌరుడి సెంటిమెంట్ అని తాను భావిస్తున్నట్లు ఠాకూర్ తెలిపారు.
ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్‌కి చెందిన ఆర్మీ కల్నల్, మేజర్ ,డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరణించిన తర్వాత భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లపై దేశంలో మరోసారి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆసియా కప్ 2023లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్ తో రెండు మ్యాచ్ లు ఆడింది. ఆసియా కప్ 2023ని వాస్తవానికి పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు, అయితే భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తమ జట్టును పంపలేమని బీసీసీఐ తెలిపింది. దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 2023లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని బెదిరించింది.చివరకు హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications