పెళ్లి చేసుకోదేమోనని ప్రియురాలికి నిప్పంటించాడు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమంటే నిర్లక్ష్యం వహిస్తోందని ఓ ప్రేమికుడు ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటిం చాడు. ఈ ఘటనలో యువతితోపాటు ఆమెను కాపాడ్డానికి వెళ్లిన తల్లిదండ్రులు, చెల్లెలు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు.

బెంగళూరులోని శ్రీరాంపు ర పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 12.30గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీరాంపురలోని సాయిబాబానగర్‌కు చెందిన నటరాజ్, అనుపమ దంపతుల కుమార్తె మేఘన ఇంజనీరింగ్ చదువుతోంది.వారి ఇంటి పక్కనే ఉండే దీపక్ ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు.

వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకోవడానికి యత్నించగా.. ఇరు కుటుంబాల వారు వెనక్కి పిలిపించారు. చదువు పూర్తయిన తర్వాత వివాహం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో కొంతకాలంగా బండిరెడ్డిపాళ్యలో నివాసముంటున్న దీపక్.. మేఘన ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.

Spurned lover sets fire to GG's house

అయితే, చదువు పూర్తయ్యే వరకు మనం కొంత దూరంగా ఉందామని మేఘన అతనితో చెప్పింది. దీంతో తనతో వివాహానికి మేఘన అంగీకరించదేమోనని అనుమానం పెంచుకున్న దీపక్.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. కిటికీలోంచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

మంటల్లో చిక్కుకున్న మేఘన కేకలు వేయడంతో మరో గదిలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలు సంజన పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా.. మంటలు వారికీ అంటుకున్నాయి. వీరి అరుపులు విని ఇరుగుపొరుగు వారు నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. పోలీసులు వచ్చి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దీపక్‌ను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+