సింగిల్ డోస్ వ్యాక్సిన్: సెప్టెంబర్ నుంచి అందుబాటులో.. ఏ టీకా అంటే..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికి 56 కోట్ల డోసుల టీకాలను పంపిణి చేశారు. ప్రస్తుతం రెండు డబుల్ డోస్ టీకాలను ఇస్తున్నారు. త్వరలో దేశంలోకి సింగిల్ డోస్ కరోనా టీకా ఇవ్వనున్నారు. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని నిపుణు అంటున్నారు.
Recommended Video
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్ స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్ ధర రూ.750 ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ అండ్ రష్యన్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

సింగిల్ డోస్ వ్యాక్సిన్ పరాగ్వేలో 93.5 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆర్‌డీఐఎఫ్ బుధవారం తెలిపింది. రష్యాలో మే నెలలో అత్యవసర వినియోగ అధికారం పొందిన సమయంలో 79.4 శాతం సామర్ధ్యాన్ని చూపించిందని ఆర్‌డీఐఎఫ్ హెడ్ కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. మెడికల్ జర్నల్ లాన్సెట్ సైతం స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6శాతం ప్రభావంతంగా ఉన్నట్లు తెలిపింది.
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ట్రయల్స్ 10 దేశాల్లో జరిగాయి. వీటిలో రష్యా, యూఏఈ, ఘానా దేశాలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ కొన్ని వేరియంట్లపై ప్రభావితంగా పనిచేస్తుందని గమలేయా సెంటర్ తెలిపింది. ఈ టీకాపై ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్ దీప్ కాంగ్ మాట్లాడుతూ సమర్థవంతమైన డేటాతో వ్యాక్సిన్‌ను ఆమోదిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. సింగిల్ డోస్ కావడంతో టీకా త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications