వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి డెత్ మిస్టరీ: బోనికపూర్ దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడు, ఆ 3 గంటల్లో ఏం జరిగింది?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై దుబాయ్‌ పబ్లిక్ ప్రాసిక్యూషన్ రీ ఇన్విస్టిగేషన్ చేస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతృప్తి చెందితేనే బౌతికకాయాన్ని శ్రీదేవికి అప్పగిస్తారు. అయితే వివాహమైన తర్వాత ముంబైకి తిరిగి వచ్చిన బోనికపూర్ మళ్ళీ దుబాయ్‌కి ఎందుకు వెళ్ళాడు. శ్రీదేవి ఆకస్మిక మరణంపై ఫోరెన్సిక్ నివేదికతో దుబాయ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో అనేక చిక్కుముడులున్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే విచారణకు సంబంధించి దుబాయ్ పోలీసులు స్పష్టత ఇస్తే ఈ అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది.

Recommended Video

Sridevi News : Dubai Police Examining Phone Records

దుబాయ్‌లో ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు వెళ్ళిన శ్రీదేవి ఫిబ్రవరి 24వ, తేది రాత్రి మృతి చెందారు. తొలుత గుండెపోటుతో ఆమె మరణించిందని కుటుంబసభ్యులు ప్రకటించారు.

శ్రీదేవి మరణానికి గుండెపోటు కారణం కాదని దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక తేల్చి చెప్పింది. బాత్‌టబ్‌లో మునగడం వల్లే ఆమె మృతి చెందిందని ఫోరెన్సిక్ నివేదిక తేల్చి చెప్పింది.శ్రీదేవి మరణానికి మూడు గంటల్లో ఏం జరిగిందనే విషయమై దుబాయ్ పోలీసులు నిజాలను నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు.

ముంబై నుండి బోనికపూర్ మళ్ళీ దుబాయ్‌ ఎందుకు వెళ్ళాడు

ముంబై నుండి బోనికపూర్ మళ్ళీ దుబాయ్‌ ఎందుకు వెళ్ళాడు

వివాహం కోసం దుబాయ్ వెళ్ళిన బోనికపూర్ చిన్న కూతురుతో కలిసి ముంబైకి తిరిగి వచ్చాడు. అయితే ఫిబ్రవరి 24వ, తేదిన సర్‌ఫ్రైజ్ ఇవ్వడానికి బోనికపూర్ దుబాయ్‌ వెళ్ళినట్టు చెబుతున్నారు.అయితే దుబాయ్‌కి బోనికపూర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. బాత్‌టబ్‌లో మునగడం వల్లే శ్రీదేవి మరణించిందని నివేదిక ప్రస్తుతం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు. అయితే దుబాయ్‌కు బోనికపూర్ ఎందుకు మళ్ళీ వచ్చాడనే విషయమై కూడ ఆరా తీస్తున్నారనే ప్రచారం సాగుతోంది.ఇదే తరుణంలో బోనికపూర్, శ్రీదేవికి మధ్య గొడవలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీదేవికి సర్‌ప్రైజ్ చేద్దామని బోనికపూర్ దుబాయ్‌కి వచ్చినా.. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు బోనికపూర్‌‌ను ఇరకాటంలో పడేశాయి. అయితే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతృప్తి చెందితే ఈ విషయమై ఇబ్బందులు తొలిగిపోయే అవకాశాలున్నాయి.

శ్రీదేవి మృతి: గంటకో మలుపు, భౌతికకాయం అప్పగింతపై కొనసాగుతున్న సస్పెన్స్ శ్రీదేవి మృతి: గంటకో మలుపు, భౌతికకాయం అప్పగింతపై కొనసాగుతున్న సస్పెన్స్

వైద్యుడిని ఎందుకు పిలవలేదు

వైద్యుడిని ఎందుకు పిలవలేదు

శ్రీదేవిని బాత్‌టబ్‌లో అపస్మారక స్థితిలో చూసిన తర్వాత వైద్యుడిని ఎందుకు పిలవలేదు, స్నేహితుడికి బోనికపూర్ ఎందుకు ఫోన్ చేశారనే విషయమై చర్చ సాగుతోంది. శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను, హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించాలని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకొంది. శ్రీదేవి ఫోన్‌కాల్‌ రికార్డులతో పాటు హోటల్‌ సీసీటీవీ ఫూటేజ్‌ మొత్తం తనకు అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అల్‌ నయీబ్‌ ఆదేశించారు.

చివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతేచివరిక్షణాల్లో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనికపూర్, దుబాయ్‌‌లో అంతే

ఖలీజ్ టైమ్స్ ఏం చెబుతోంది

ఖలీజ్ టైమ్స్ ఏం చెబుతోంది

ఖలీజ్‌ టైమ్స్‌ పత్రిక శ్రీదేవి శరీరంలో మద్యం ఆనవాళ్లున్నట్లు ఫోరెన్సిక్‌ పూర్తి నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. మద్యం మత్తులో ఆమె తూలి బాత్‌టబ్‌లో పడి మునిగిపోయి మరణించి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. అయితే శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని కొందరు వాదిస్తున్నారు.

పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో జోక్యం ఉండదు

పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో జోక్యం ఉండదు

దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ గల్ఫ్‌ దేశాల్లోకెల్లా శక్తివంతమైనది కావడంతో ఆషామాషీగా పోస్టుమార్టం తంతు ముగించుకొని బయటపడటం కుదరదు. ఇక్కడ దేశానికి రాజు కూడా జోక్యం చేసుకోలేరు.గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న అంశాలను అధికారులు, దౌత్యవేత్తలు, కనీసం మీడియా కూడా బయటకు వెల్లడించడానికి వీల్లేదు. దాంతో కేసుకు సంబంధించిన అంశాలేవీ బయటకు రావడం లేదు.

ఆ మూడు గంటలు ఏం జరిగింది

ఆ మూడు గంటలు ఏం జరిగింది

శ్రీదేవి మరణం జరిగిన ఫిబ్రవరి 24వ, తేదిన మూడు గంటల పాటు ఏం జరిగిందనే విషయమై ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ విషయమై దుబాయ్ పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ మూడు గంటల్లో ఏం జరిగిందనేది తేలితే శ్రీదేవి మరణంపై అనుమానాలు తీరే అవకాశం లేకపోలేదు.దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Sridevi died after accidentally drowning in her hotel bathtub after losing consciousness, Dubai officials have declared. The post-mortem report does not mention the phrase cardiac arrest, which was earlier blamed for her sudden death that has left India stunned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X