వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి తెలియదు.. అప్పటిదాకా గుర్తించలేదు: దుబాయ్‌లో కేరళ వ్యక్తి సాయం

|
Google Oneindia TeluguNews

ముంబై: శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్‌కు తరలించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తీసుకు వచ్చారు.

Recommended Video

Sridevi's Last Rites Update : Fans Can Pay Tributes

మొదటలోఖండ్‌వాలాలోని శ్రీదేవి నివాసానికి తరలించారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు తరలించారు. తమ అభిమాన నటిని ఆఖరుసారిగా కళ్లారా చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి?మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి?

సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయం

సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయం

శ్రీదేవి నివాసం వద్ద, క్లబ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలా ఉండగా, దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసును క్లోజ్ చేసిన తర్వాతనే భారత్‌కు, కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే.

అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్!అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్!

కేరళకు చెందిన సామాజిక కార్యకర్త

కేరళకు చెందిన సామాజిక కార్యకర్త

శ్రీదేవి భౌతికకాయానికి శవపరీక్షలు నిర్వహించిన సమయంలో కేరళకు చెందిన సామాజిక కార్యకర్త అష్రఫ్ తమరచ్చేరి కూడా సాయం చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కథనం మేరకు.. ఈయన కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు.

ప్రవాసులకు ఇలా

ప్రవాసులకు ఇలా

మార్చురీలో శవపరీక్షలు జరిగినప్పుడు డాక్టర్లకు సాయపడటం, ఆ ప్రక్రియ పూర్తయ్యాక, పార్థివదేహాన్ని అన్ని రసాయనాలతో కలిపి పాడవకుండా బాగు చేసి ఓ రూపం తెచ్చి బంధువులకు అఫ్పగించడం అష్రాప్ చేసే పని. ఆయన ఇప్పటి వరకు రెండున్నర వేలమంది ప్రవాసుల మృతదేహాలకు చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడంలో సహకరించారు.

శ్రీదేవిని ఎప్పుడు చూడలేదట

శ్రీదేవిని ఎప్పుడు చూడలేదట

ఆయన అజ్మాన్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. దుబాయ్‌లోని హోటల్లో కన్నుమూసిన శ్రీదేవి మృతదేహం అప్పగింతలోను ఆయన సహకరించారు. అయితే ఆమెను అంతకుముందు ఆయన ఎప్పుడూ చూడలేదట.

శ్రీదేవిని అక్కడే చూశారు

శ్రీదేవిని అక్కడే చూశారు

మార్చురీకి వచ్చాక శ్రీదేవిని చూశారు. దుబాయ్ ప్రభుత్వ అధికారులతో వ్యవహరించేందుకు ఇండియన్ కాన్సులేట్ ఆయనకు పవర్ ఆఫ్ అటార్నీ లాంటిది ఇచ్చిందట. మార్చురిలోకి బోనీ కపూర్ తరఫున మేనల్లుడు సౌరబ్‌ను అనుమతించారు.

అప్పుడే గుర్తించారు

అప్పుడే గుర్తించారు

మార్చురీలో సౌరబ్ చూపించడంతోనే అష్రాఫ్ ఆమెను గుర్తించినట్లుగా సంతకం పెట్టి, తన వీసా కాపిని మార్చురీలో ఇచ్చారట. భౌతికకాయం మార్చురీ నుంచి విమానాశ్రయం చేరేదాకా ఆయన సహకరించారు.

English summary
The mortal remains of late actress Sridevi was repatriated from Dubai by a Malayali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X