అందమైన కథ ముగిసింది: సినీ, రాజకీయ దిగ్గజాల దిగ్భ్రాంతి, హేమ, సచిన్.. ఏమన్నారంటే..?
ముంబై: అందాల తార శ్రీదేవి మరణాన్ని ఇటు సినీ ప్రముఖులు, అటు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దేశ చలన చిత్ర రంగంలోనే ఓ దిగ్గజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. లేరంటే తాము నమ్మలేకపోతున్నామని వారంటున్నారు.
ముఖ్యంగా తెలుగు, బాలీవుడ్(హిందీ) సినీ పరిశ్రమలో ఆమె ఎక్కువ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తమ అభిమాన తార లేదని తెలిసి వారంతా విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీదేవి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Recommended Video


మార్గదర్శి.. అమిత్ షా
భారత దిగ్గజ సినీ నటి శ్రీదేవి మరణం తనను ఎంతగానో బాధించిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. భారత సినీ పరిశ్రమకు ఆమె లేని లోటు తీరనిదని వ్యాఖ్యానించారు. ఆమె భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులకు దేవుడు ధైర్యం కలిగించాలని కోరారు.

అద్భుత నటి.. హేమా మాలిని
శ్రీదేవి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలిని అన్నారు. అద్భుత నటి, మంచి వ్యక్తిని కోల్పోవడం ఊహించుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరని చెప్పారు. శ్రీదేవి ఇక లేదంటే నమ్మలేకపోతున్నామని సినీ నిర్మాత మధూర్ భండార్కర్ అన్నారు. ఆమె మరణంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు. ఇది చాలా చాలా విచారకరమైన రోజని అన్నారు.

పీయూష్ గోయల్
శ్రీదేవి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కళా రంగంలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. వెండితెరపై ఆమె ప్రతిభను మనమంతా చూశామని చెప్పారు. ఆమె మరణం దేశానికి తీరని లోటని కేంద్రమంత్రి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు.

అద్వితీయం- రాహుల్ గాంధీ
భారత అభిమాన నటి శ్రీదేవి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భాషా భేదం లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఆమె రాణించారని చెప్పారు. ఆమె ప్రతిభ అద్వితీయమని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన రాహుల్.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

అందమైన అధ్యాయం.. శేఖర్ కపూర్
ఒక అందమైన అధ్యాయం ముగిసిందని బాలీవుడ్ దర్శక నిర్మాత శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. ఆమె ఒక అద్భుతమైన స్ఫూర్తి అని అన్నారు. ఎంతోమందిలో ప్రేమానుభూతులు నింపిన ఆమె ఇక లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందంతోపాటు మంచి మనసున్న గొప్ప నటిని కోల్పోయామని మరో నటుడు రంజీత్ వ్యాఖ్యానించారు. శ్రీదేవి మరణం మొత్తం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసిందని అశోక్ పండిట్ వ్యాఖ్యానించారు.

శశిథరూర్
శ్రీదేవి మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న శ్రీదేవి.. వారందర్నీ విషాదంలోకి నెట్టేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రియన్ కవి రాయినర్ మారియా రిల్కే రాసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు.

పవర్ హౌస్.. స్మృతీ ఇరానీ
శ్రీదేవి నటనకు ఒక పవర్ హౌస్ లాంటివారని కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నటి కూడా అయిన స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. తన రంగంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆమె ఆకస్మిక మరణం అందర్నీ విషాదంలోకి నెట్టేసిందని అన్నారు. శ్రీదేవి కుటుంబసభ్యులు, ఆమెను ప్రేమించే ప్రతీఒక్కరికీ స్మృతీ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. శ్రీదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

ఆమెను చూస్తూ.. సచిన్ టెండూల్కర్
శ్రీదేవి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. ఆమెను వెండితెరపై చూస్తూ పెరిగామని, ఇప్పుడు ఆమె లేరంటే నమ్మలేపోతున్నామని చెప్పారు. ఆమె కుటుంబసభ్యులకు సచిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రజినీ, అక్షయ్, కమల్
శ్రీదేవి మృతిపై ప్రముఖ సినీ నటులు రజినీకాంత్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజమైన ఓ దిగ్గజాన్ని సినీ పరిశ్రమ కోల్పోయిందని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. శ్రీదేవి మృతికి అక్షయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక గొప్ప నటిని కోల్పోయామని, ఆమెతో కలిసి నటించిన మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ తన వెంటే ఉంటాయని కమల్ హాసన్ అన్నారు. ఆమెను చివరగా ఇటీవలే కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆమెను చాలా మిస్సవుతున్నామని చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications