ఆఖరి పయనంలోనూ శ్రీదేవి రికార్డు?: అప్పట్లో రఫీ.. ఆ తర్వాత!
Recommended Video

ముంబై: అర్థ శతాబ్దం పాటు తమను అలరించిన అందాల నటి శ్రీదేవి ఆఖరి పయనం ముంబైని జనసంద్రంగా మార్చింది. అశ్రు నయనాల మధ్య లక్షల్లో తరలివచ్చిన ఆమె అభిమానులు కడసారి చూపుకోసం కి.మీ కొద్ది బారులు తీరారు.
వెండి తెరపై శ్రీదేవికి నీరాజనాలు పలికిన జనం.. అంతిమయాత్రలోనూ లక్షలాదిగా తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంత జనంతో శ్రీదేవి అంతిమయాత్ర ఒకవిధంగా రికార్డు అనే అంటున్నారు. రాజకీయేతర వ్యక్తుల్లో ఇంతలా నీరాజనాలు అందుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా శ్రీదేవి నిలిచిపోయారు.

ఆల్ టైమ్ రికార్డు.. రఫీదే:
ముంబైలో రాజకీయేతర ప్రముఖుల అంతిమయాత్రల్లో అలనాటి గాయకుడు మహమ్మద్ రఫీదే ఆల్ టైమ్ రికార్డు అని చెబుతుంటారు. తన గాత్రంతో దేశంలోని అన్ని వర్గాలకు దగ్గరైన రఫీ కోసం.. ఆయన అంతిమయాత్ర(జులై, 1980)కు దాదాపు 10లక్షల పైచిలుకు జనం తరలివచ్చినట్టు చెబుతారు.

రాజేశ్ ఖన్నా, రాజ్ కపూర్:
మహమ్మద్ రఫీ తర్వాత భారతీయ మొట్టమొదటి వెండితెర సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా(జులై,2012) అంతిమయాత్రకు మళ్లీ ఆ స్థాయిలో జనం తరలివచ్చారు. రాజ్‌కపూర్(జూన్, 1988), వినోద్ ఖన్నా(ఏప్రిల్ 2017)ల అంతిమయాత్రల్లోనూ లక్షలాది జనం కనిపించారు.

మళ్లీ ఇప్పుడు శ్రీదేవి..:
రఫీ, రాజేశ్ ఖన్నా,రాజ్ కపూర్, వినోద్ ఖన్నాల తర్వాత.. శ్రీదేవి అంతిమయాత్రలోనే జనం ఆ స్థాయిలో తరలివచ్చారు. బహు భాషల్లో నటించిన నటిగానూ, తన అందంతోనూ దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరవడంతో ఆమెను భారతీయ మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్ అని మీడియా కొనియాడుతున్న సంగతి తెలిసిందే.

తరలివచ్చిన తారలు..:
శ్రీదేవి మరణంపై అనుమానాల సంగతెలా ఉన్నా.. ఆఖరి యాత్ర మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. అన్ని రంగాల ప్రముఖులతో పాటు ప్రధానంగా సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తారలు తరలివచ్చారు. అమితాబ్ బచ్చన్, రేఖ, ఐశ్వర్య రాయ్, అర్బాజ్ ఖాన్, మాధూరి దీక్షిత్, అక్షయ్ ఖన్నా, టబు, ఫరా ఖాన్, నితిన్ ముఖేష్, విద్యా బాలన్, సుశ్మితాః సేన్, హేమ మాలిని తదితరలు తరలివచ్చారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications