Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు: బైకాట్ ట్రెండింగ్, ఎందుకంటే?

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన 'పఠాన్' చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన 'బేషరమ్ రంగ్' పాటలో హీరోయిన్ మోతాదుకు మించి అందాలను ఆరబోయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘పఠాన్’ను బ్యాన్ చేయాలంటూ నిరసనలు

‘పఠాన్’ను బ్యాన్ చేయాలంటూ నిరసనలు


ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల పఠాన్ సినిమాను నిషేధించాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. 'వీర్ శివాజీ గ్రూప్' కార్యకర్తలు ఇండోర్ నగరంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా షారుక్, దీపిక దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అశ్లీలతను ప్రోత్సహిస్తున్న ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డిమాండ్ చేశారు.

దీపికా దుస్తులపై అభ్యంతరం

దీపికా దుస్తులపై అభ్యంతరం

ఈ వివాదంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా స్పందించారు. ఈ పాటలో దీపిక ధరించిన దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సీన్లను సరిచేయకపోతే తమ రాష్ట్రంలో పటాన్ చిత్రాన్ని ప్రదర్శించాలా? వద్దా? అనేదానిపై ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు, జేఎన్‌యూ కేసులో తుక్గే తుక్గే గ్యాంగ్‌కు దీపిక మద్దతుగా కనిపించారని ఆయన మండిపడ్డారు.

ట్విట్టర్‌లోనూ ‘బైకాట్ పఠాన్’ ట్రెండింగ్

ట్విట్టర్‌లోనూ ‘బైకాట్ పఠాన్’ ట్రెండింగ్

ఇది ఇలావుండగా, ట్విట్టర్‌లోనూ 'బాయ్‌కాట్ పఠాన్' హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం గమనార్హం. దీపిక ధరించిన దుస్తులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ సినిమాను అమ్ముకోవడం కోసం ఇంతగా దిగజారాలా? అని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలతో చిత్ర బృందం చిక్కుల్లో పడినట్లయింది. ఇప్పటికే పలు చిత్రాలు బాయ్‌కాట్ చేయడం వల్ల భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే.

‘పఠాన్‌’పైనే షారుక్ అభిమానుల ఆశలు

‘పఠాన్‌’పైనే షారుక్ అభిమానుల ఆశలు


కాగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం.. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత షారుక్ చిత్రం వస్తుండటంతో ఆయన అభిమానులు సినిమాను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+