పోలింగ్‌కు సర్వం సిద్దం, 19న ఓట్ల లెక్కింపు(ఫోటోలు)
న్యూఢిల్లీ: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ స్థానాలకు ఈ నెల బుధవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా... హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఆధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందచేసి ఆయా రాష్ట్రాలకు పంపింది.
మహారాష్ట్రలోని 288 సీట్లు, హర్యానా అసెంబ్లీలో 90 సీట్లకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం సాధించిన పెట్టిన నరేంద్రమోడీ ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం దక్కాలని ఏకంగా 30 ర్యాలీల్లో పాల్గొన్నారు.
మహారాష్ట్రలో 8.25 కోట్ల మంది ఓటర్లు.. 1,699 మంది స్వతంత్రులు సహా 4,119 మంది అభ్యర్దుల భవితవ్వాన్ని తేల్చనున్నారు. భారతీయ జనతా పార్టీ 257 సీట్లలో, దాని మిత్రపక్షాలు 31 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
1989 తర్వాత మహారాష్ట్రలోని ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక హర్యానాలో బీజేపీ తొలిసారిగా మొత్తం 90 స్దానాల్లో పోటీ చేస్తోంది. ఈ సారి హర్యానాలో రెండు కొత్త పార్టీలు (హర్యానా జనచేతన పార్టీ, హర్యానా లోకహిత పార్టీ)తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
హర్యానాలో రెండు సార్లు ముఖ్యమంత్రి స్దానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ముడో సారి కూడా పాగా వేయాలని చూస్తోంది. టీచర్ల కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా జైలు పాలవ్వడంతో ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరమయ్యారు. రెండు రాష్టాల్లో కూడా 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మహారాష్ట్రలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 82, ఎన్‌సిపికి 62, శివసేనకు 45, బిజెపికి 47, ఎంఎన్‌ఎస్‌కు 12 సీట్లు వచ్చాయి.

పోలింగ్‌కు సర్వం సిద్దం, 19న ఓట్ల లెక్కింపు
మంగళవారం ముంబైలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పంపిణీ కేంద్రం నుండి ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకూ తీసుకెళ్తున్న ఎన్నికల అధికారులు.

మంగళవారం ముంబైలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కరాద్ ప్రాంతంలో ఈవీఎంలను చెక్ చేసుకుంటున్న ఎన్నికల అధికారులు.

పోలింగ్‌కు సర్వం సిద్దం, 19న ఓట్ల లెక్కింపు
మంగళవారం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పంపిణీ కేంద్రం నుండి ఈవీఎంలను బస్సులో పోలింగ్ స్టేషన్లకూ తీసుకెళ్తున్న ఎన్నికల అధికారులు.

పోలింగ్‌కు సర్వం సిద్దం, 19న ఓట్ల లెక్కింపు
మంగళవారం ముంబైలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కరాద్ ప్రాంతంలో ఈవీఎంలను చెక్ చేసుకుంటున్న ఎన్నికల అధికారులు.

పోలింగ్‌కు సర్వం సిద్దం, 19న ఓట్ల లెక్కింపు
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పోలింగ్ స్టేషన్‌లో ఉన్న ఈవీఎం మిషన్లకు కాపలా కాస్తున్న పోలీసు.

Click it and Unblock the Notifications