ఢిల్లీ ఘాతుకం: చంపేసి యువతి శవం వద్ద డ్యాన్స్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం మహిళా ఉపాధ్యాయురాలిని చంపేసిన తర్వాత ప్రేమోన్మాది చేసిన చర్యకు అందరూ బిత్తరపోయారు. ఆ కిరాతకుడు యువతిని కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపిన తర్వాత మృతదేహం వద్ద నృత్యం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుున్నారు.
తాను యువకుడిని ఆపేందుకు ప్రయత్నించానని, అయితే తనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆయన తెలిపాడు. యువతిని పొడిచిన తర్వాత మృతదేహం వద్ద నిందితుడు డ్యాన్స్ చేశాడని అతను చెప్పాడు. యువతి మరో యువకుడితో ప్రేమలో ఉందని భావించి నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఈ ఘటనపై నార్త్ ఢిల్లీ డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు.

హత్యకు గురైన యువతి కరుణ నావెల్ రీచెస్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. నిందితుడిని సురేందర్ సింగ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. హత్య జరిగిన తర్వాత స్థానికులు అతన్ని పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
నిందితుడు పెట్టిన శిక్షణా కేంద్రంలో కరుణ కప్యూటర్ పాఠాలు నేర్చుకునేది. ఆ సమయంలో అతను ఆమెను ప్రేమిచాడని పోలీులు తెలిపారు. ఏడాది కాలంగా అతను కరుణను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు కూడా తెలిపారు. నిందితుడికి ఓ దుకాణం ఉంది. అతనికి ఇదివరకే పెళ్లయింది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. కరుణ హత్యపై ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్రం నివేదికను కోరింది.
మనీష్ కుమార్ అనే సాక్షి కరుణను ఆటో రిక్షాలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. తాను యువతికి సాయం చేయడానికి వెళ్లానని, రెండు సార్లు 100కు ఫోన్ చేశానని, పోలీసులు రాలేదని, దాంతో ఆ తర్వాత తాను అంబులెన్స్‌కు ఫోన్ చేశానని మనీష్ కుమార్ అనే వ్యక్తి చెప్పాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications