ఐఏఎస్ అధికారి కుమార్తెకు వేధింపులు: హరియాణా బీజేపీ చీఫ్ కొడుకు వికాస్ అరెస్టు !

Posted By:
Subscribe to Oneindia Telugu

ఛంఢీగడ్: ఐఏఎస్ అధికారి కుమార్తెను వెంటాడి వేధించిన కేసులో హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా(23)లను బుధవారం మద్యాహ్నం ఛంఢీగడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ బరాలాను ఛంఢీగడ్ సెక్టార్ 26వ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు.

ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుంద్రాను వెంటాడిన వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశిశ్ కుమార్ వేధింపులకు గురి చేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వికాస్ బరాలా, ఆశిశ్ కుమార్ ఇద్దరూ న్యాయ విద్యార్థులు.

Stalking case:Vikas Barala arrested in Chandigarh

రక్త, మూత్ర నమూనాలు ఇచ్చేందుకు వికాస్ బరాలా నిరాకరించాడు. బుధవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. సమన్లు తీసుకోవడానికి వికాస్ బరాలా నిరాకరించాడు. అయితే పోలీసులు వికాస్ బారాల ఇంటికి సమన్లు అతికించారు.

బాధిత యువతి వర్ణికా కుంద్రా తన కుమార్తె లాంటిది, విచారణకు పూర్తిగా సహకరిస్తామని హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా మీడియాకు చెప్పారు. వికాస్ బరాలా, ఆశిశ్ కుమార్ యువతిని వెంటాడి వేధించారని ఆరు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యిందని, మరికొన్ని సాక్షాలు సేకరిస్తున్నామని హరియాణా డీజీపీ లుథారా మీడియాకు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Chandigarh Police on Wednesday arrested Haryana Bharatiya Janata Party chief Subhash Barala's son, Vikas Barala, who has been accused of stalking a woman, soon after he arrived at Chandigarh's sector 26 police station,
Please Wait while comments are loading...