Star Hero: వివాదంలో హీరో, హోటల్ లో దళితుడిపై దాడి ?, లాక్ డౌన్ లో పార్టీ, హోమ్ శాఖ ఎంట్రీ !

బెంగళూరు/ మైసూరు: స్టార్ హోటల్ లో సప్లేర్ ను ప్రముఖ హీరో చితకబాదాడని ఆరోపణలు ఉన్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వివాదం పెద్దది అయ్యింది. లాక్ డౌన్ లో నియమాలు ఉల్లంఘించి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకోవడమే నేరమని, అలాంటిది హోటల్ లో పని చేస్తున్న దళితుడైన సప్లేర్ ను హీరో చితకబాదాడని ప్రముఖ దర్శక నిర్మాత మీడియా ముందుకు వచ్చారు. నేను ఎవ్వరి మీద దాడి చెయ్యలేదని, సప్లేర్ మీద కేకలు వేశాను అంతే అని స్టార్ హీరో అంటున్నారు. ఇదే విషయంలో హోటల్ యజమాని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ప్రముఖ హోటల్ లో పని చేస్తున్న సిబ్బంది మీద స్టార్ హీరో దాడి చేశాడా ? అని విచారణ చెయ్యాలని సిటీ పోలీసు కమిషనర్ కు హోమ్ శాఖ ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

నెల రోజు ముందే జరిగింది..... ఇప్పుడు ?

నెల రోజు ముందే జరిగింది..... ఇప్పుడు ?

కర్ణాటకలోని రాచనగరి మైసూరులోని సందేష్ ప్రిన్స్ హోటల్ లో పని చేస్తున్న సప్లేయర్ మీద ప్రముఖ కన్నడ హీరో, కురుక్షేత ఫేమ్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ దాడి చేశాడని ఆరోపలు వచ్చాయి. గత నెలలో మైసూరులోని సందేష్ ప్రిన్స్ హోటల్ లో హీరో దర్శన్ రెచ్చిపోయాడని ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు, సీనియర్ పాత్రికేయుడు ఇద్రజిత్ లంకేష్ మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు.

 నేను కొట్టలేదు

నేను కొట్టలేదు

నేను మైసూరుకు ఎప్పుడు వెళ్లినా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సందేష్ నాగరాజ్ (స్యాండిల్ వుడ్ ప్రముఖ నిర్మాత, హీరో దర్శన్ తండ్రి స్నేహితుడు)కు చెందిన సందేష్ ప్రిన్స్ హోటల్ లో ఉంటానని హీరో దర్శన్ అన్నారు. ఆ రోజు హోటల్ లో సప్లేర్ నిర్లక్షంగా వ్యవహరించడంతో తాను అతని మీద కేకలు వేశానని, నేను ఎవ్వరి మీద దాడి చెయ్యలేదని ప్రమఖ కన్నడ హీరో దర్శన్ అంటున్నారు.

హోటల్ యజమాని క్లారిటి

హోటల్ యజమాని క్లారిటి

హోటల్ సప్లేర్ దళితుడు కావడం వలనే అతని మీద హీరో దర్శన్ దాడి చేశాడని ఇద్రజిత్ లంకేష్ ఆరోపిస్తున్నారు. కన్నడ హీరో దర్శన్ మీద ఇద్రజిత్ లంకేష్ మీడియా ముందు ఆరోపణలు చెయ్యడంతో వివాదం ముదిరిపోయి రాజకీయ రంగు పులుముకుంది. మా హోటల్ లో హీరో దర్శన్ ఎవరి మీద దాడి చెయ్యలేదని సందేష్ ప్రిన్స్ హోటల్ యజమాని సందేష్ కుమారుడు సందేష్ అంటున్నారు.

లాక్ డౌన్ లో పార్టీ జరిగింది

లాక్ డౌన్ లో పార్టీ జరిగింది

,గత నెలలో మైసూరులో హోటల్ సప్లేర్ మీద హీరో దర్శన్ దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ లో సమయంలోనే హోటల్ లో దర్శన్ ఆయన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న మాట నిజం అని, అయితే అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, నేను అక్కడే ఉన్నానని హోటల్ యజమాని సందేష్ నాగరాజ్ కుమారుడు సందేష్ గురువారం మీడియాకు చెప్పారు. హోటల్ సప్లేర్ భార్య కేసు పెట్టలేదని, మేము కేసు పెట్టలేదని, పోలీసు కేసు పెట్టే అంత పెద్ద పంచాయితీలు మా హోటల్ లో ఏమీ జరగలేదని సందేష్ వివరణ ఇచ్చారు.

 రాజకీయ రంగు అంటుకుంది

రాజకీయ రంగు అంటుకుంది

హీరో దర్శన్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. మండ్య లోక్ సభ సభ్యురాలు, ప్రముఖ నటి సుమలతకు మద్దతుగా మాట్లాడుతున్న దర్శన్ మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి, జేడీఎస్ నాయకులు మండిపడుతున్న సమయంలోనే నెల ముందు జరిగిన గొడవ తెరమీదకు వచ్చింది.

విచారణకు హోమ్ శాఖ ఆదేశాలు

విచారణకు హోమ్ శాఖ ఆదేశాలు

మైసూరులోని సందేష్ ప్రిన్స్ హోటల్ లో లాక్ డౌన్ సమయంలో ఏం జరిగింది ?, దాడిలో ఎవరైనా ఆసుపత్రి పాలైనారా ? అనే విషయంపై దర్యాప్తు చెయ్యాలని కర్ణాటక హోమ్ శాఖ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ మైసూరు సిటీ పోలీసు కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద కర్ణాటకలో ఇప్పుడు స్టార్ హీరో దర్శన్ కు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా కొందరు మీడియా ముందుకు వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+