రోడ్ షోలు, ర్యాలీల్లో బీజీ అయిపోయిన స్టార్ హీరో, ఈగ ఫేమ్, మాట ఇచ్చాను అంతే !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపిన ప్రముఖ నాయకులు ఇప్పుడు సినీ తారలను రంగంలోకి దింపుతున్నారు. కర్ణాటకలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఒకే రోజు ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి బీజేపీ నాయకులు పక్కాప్లాన్ చేశారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి హీరో సుదీప్ ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. హీరో సుదీప్ ర్యాలీలు, బహిరంగ సభల్లో స్థానిక ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించి బీజేపీ నాయకులను గెలిపించాలని మనవి చేస్తున్నారు.

ఈ సందర్బంగా హీరో సుదీప్ మాట్లాడుతూ తాను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి మాట ఇచ్చానని, తాను ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం పూర్తి అయ్యే వరకు బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ సూచించిన అభ్యర్థుల తరపున తాను ఎన్నికల ప్రచారం చేస్తానని హీరో సుదీప్ చెప్పారు.

sudheep

తాను బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చెయ్యడంలో తన స్వార్థం కూడా ఉందని హీరో సుదీప్ అన్నారు. తాను హుబ్బళి సినిమా విడుదల సమయంలోనే బహిరంగ ర్యాలీలో పాల్గొన్నానని, తరువాత అభిమానుల మధ్యకు వెళ్లలేకపోయానని, ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్బంగా తాను వివిద జిల్లాల్లోని తన అభిమానులను నేరుగా కలుకోవడానికి అవకాశం చిక్కిందని హీరో సుదీప్ అన్నారు.

సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ వేసిన సమయంలో శిగ్లావిలో రోడ్ షోలో పాల్గొని సీఎం తరుపున ప్రచారం చేసిన హీరో సుదీప్ తరువాత ఎన్నికల ప్రచారానికి దూరం అయ్యారు. ఇప్పుడు పలు నియోజక వర్గాల్లో వరుసగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి హీరో సుదీప్ సిద్దం కావడంతో ఆయన అభిమానులతో పాటు బీజేపీ నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.

కర్ణాటకలోని చిత్రదుర్గ, బళ్లారి, దావణగెరె జిల్లాలో హీరో సుదీప్ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చిత్రదుర్గాలోని మాళకాల్కూరులో బీజేపీ అభ్యర్థి తిప్పేస్వామి తరుపున, తరువాత మాయకొండ, దావరణగెరె ఉత్తర నియోజక వర్గం, దావణగెరె దక్షిణ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థుల తరుపున హీరో సుదీప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

బుధవారం సాయంత్రం బళ్లారిలోని సండూరులో హీరో సుదీప్ ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. విపరీతమైన ఎండ కారణంగా మద్యాహ్నం రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చెయ్యకూడదని అనుకున్నామని, అయితే పరిస్థితులు, ఎండ తీవ్రతన అంచనా వేసిన తరువాత తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని హీరో సుదీప్ క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+