వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరేం చేస్తున్నారు, దాడులు జరగకుండా రాష్ట్రాలే చూడాలి: సుప్రీం కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గోసంరక్షణ పేరిట దాడులు చెయ్యడం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలదేనని సుప్రీం కోర్టు మంగళవారం అభిప్రాయం పడింది. గోసంరక్షణ దాడులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మార్గదర్శకాలను జారీ చేయాల్సిందిగా వేసిన పిటిషన్లని విచారించింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించి దీనికి సంబంధించిన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ దాడిలో గాయపడిన వారిని బాధితులగా పరిగణించాలని, వారిని కుల, మత ప్రాతిపదికన చూడరాదని పేర్కొంది.

States governments are responsible for curbing cow vigilantism, says Supreme Court

చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, గోసంరక్షణ పేరిట ఇతరులపై దాడి సరికాదని, ఆ బాధ్యత రాష్ట్రాలదే అన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.

దీంతో పాటు ఈ దాడులు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

English summary
The Supreme Court on Tuesday said incidents of cow vigilantism were unacceptable, and it was up to the states to prevent them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X