కరోనా కట్టడిలో మీ భాగస్వామ్యం: జాగ్రత్తచర్యలను సెల్ఫీలు తీసి వన్ ఇండియాకు పంపండి..!
ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్ కనుగొనలేదు. అయితే పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఇక కోవిడ్-19 తీవ్ర స్థాయిలో ఉన్న వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్‌తో పాటు యాంటిబయాటిక్స్ ఇవ్వాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సూచించింది.
కరోనావైరస్‌ను పారద్రోలాలంటే ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిపై విజయం సాధించొచ్చని వెల్లడిస్తోంది. ఇందులో ముఖ్యమైనది సోషల్ డిస్టెన్సింగ్, స్వీయ నిర్బంధంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఐదువందలకు పైగా జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం గట్టిగా చెప్పడంతో ప్రజలంతా మెజార్టీ సమయాన్ని ఇళ్లల్లోనే గడిపేస్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక మీరు మీ ఇళ్లల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో ఇతరులకు మా వన్ ఇండియా ద్వారా తెలియజేయండి. మీరు పాటిస్తున్న జాగ్రత్తలు అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. ఇంట్లో ఉన్న సమయంలో మీరు చేస్తున్న కార్యక్రమాలు లాంటివి ఫోటోలు లేదా వీడియోలను ఈ కింద ఇచ్చిన మెయిల్ ఐడీకి పంపించండి. వీటిని వన్‌ఇండియా వెబ్‌సైట్‌పై పోస్టు చేస్తాం. తద్వారా మీరు పాటిస్తున్న జాగ్రత్తలు ఇతర దేశాల్లో ఉన్న మనవాళ్లకు చేరవేస్తాం. మీరు ఇంట్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై సెల్ఫీలు తీసి మాకు పంపడమే మీరు చేయాల్సింది. మీ సెల్ఫీ ఫోటోలు పంపాల్సిన మెయిల్ ఐడీ: [email protected]
Recommended Video
ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఇళ్లల్లో మీరు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను సెల్ఫీలుగా తీసి మాకు పంపండి. మేము మీ ఫోటోలను పబ్లిష్ చేస్తాం. తద్వారా బయట ప్రపంచానికి కొన్ని సూచనలు సలహాలు ఇద్దాం. ఫోటోలకు #stayathomeselfies ట్యాగ్ ఇవ్వండి.












Click it and Unblock the Notifications