వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకీ గాయానికి బ్యాండ్ ఎయిడ్ వేస్తారా?: ఆర్బీఐ మిగులు బదిలీపై రాహుల్ సెటైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. భారత రిజర్వు బ్యాంక్ వద్ద మిగులుగా ఉన్న రూ. 1.76లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వంకు బదిలీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఎకనామిక్ కేపిటల్ ఫ్రేమ్‌వర్క్(ఈసీఎఫ్) బీమల్ జలన్ ప్యానెల్ సిఫార్సుల ప్రకారం భారత రిజర్వు బ్యాంక్ సోమవారం 1.76లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్థిక సమస్యలను ప్రధానమంత్రి, ఆర్థికమంత్రే సృష్టించారని ఈ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆరోపించారు.

Stealing from RBI wont work: Rahul Gandhi on surplus reserves transfer

'ప్రధాని, ఆర్థికమంత్రికి వారు సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో తెలియదు. ఆర్బీఐలో దొంగతనం చేయడంతో పని జరగదు. ఇది తుపాకీ గాయానికి బ్యాండ్-ఎయిడ్ వేసినట్లే అవుతుంది' అని రాహుల్ గాంధీ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి #rbilooted అనే హాష్ ట్యాట్ కూడా ఇచ్చారు.

ఆర్బీఐ గవర్నర్‌కు శుక్రవారం జలన్ ప్యానెల్ నివేదికను సమర్పించింది. ముందే నిర్ణయించిన ఫార్ములా ఆధారంగా మూడు-ఐదు సంవత్సరాలలో మిగులు నిల్వలను అస్థిరమైన రీతిలో ప్రభుత్వానికి బదిలీ చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ఇచ్చే మిగులు నిధులు తోడ్పడనున్నాయి.

2018-19 సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,76,051 కోట్లను కేంద్రానికి బదిలీ చేయగా, ఇందులో రూ. 1,23,414 కోట్లు అదనపు నిధులు కాగా, రూ. 52,637కోట్లు అదనపు కేటాయింపులుగా గుర్తించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

English summary
Congress MP Rahul Gandhi on Tuesday trained his gun at the BJP-led Union Government over the RBI's central board approving a surplus transfer of Rs 1.76 lakh crore to the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X