
అరవింద్ కేజ్రీవాల్ సూరత్ రోడ్‌షోపై రాళ్లదాడి: బీజేపీపై ఘాటు విమర్శలు
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం సూరత్‌లో అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. అయితే, ఈ సమయంలో కొందరు కేజ్రీవాల్ ర్యాలీపై రాళ్లు విసిరారు. దీంతో ఒకరిద్దరికి గాయాలయ్యాయి.
पत्थरबाज़ BJP!
— AAP (@AamAadmiParty) November 28, 2022
अभी मैं आ रहा था तो इन्होंने मुझ पर पत्थर फेंके।मेरा क्या कसूर?
अगर 27 साल कुछ काम कर लेते तो मुझ पर पत्थर फेंकने की ज़रूरत नहीं पड़ती
इनका नेता कहता है-हम केजरीवाल के पैर तोड़ देंगे,आंख फोड़ देंगे क्योंकि मैं School-Hospital की बात करता हूँ
-CM @ArvindKejriwal pic.twitter.com/xmiZcgsk35
ఈ నేపథ్యంలో బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. తనపై రాళ్లు విసరాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మీ నాయకులు చెప్పారనే నాపై రాళ్లు దాడులు చేస్తున్నారా? అని పరోక్షంగా బీజేపీ నాయకత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని అన్నారు.

అయితే, అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీపై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు. కేజ్రీవాల్ ర్యాలీగా వస్తున్న సమయంలో కొందరు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారని, వారిని తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.కానీ, కేజ్రీవాల్ మాత్రం తమపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించారు.
No incident of stone pelting was reported during (AAP national convenor) Arvind Kejriwal's rally. I was present on the spot. The rally was conducted peacefully. The accused was raising slogans of "Modi-Modi" during Kejriwal's rally, so he has been detained: Police
— ANI (@ANI) November 28, 2022
ఇంతకుముందు కూడా తమ ర్యాలీపై రాళ్ల దాడి జరిగిందని ఆప్ నేతలు చెబుతున్నారు. గోపాల్ ఇటాలియా అనే ఆప్ నేత ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. రాళ్ల దాడి ఒకరు గాయపడ్డారని పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఆప్ గెలవబోతోందని వ్యాఖ్యానించారు.
कतारगाम विधानसभा चुनाव हारने के डर से बौखला गए भाजपाई गुंडों ने आज मेरी जनसभा पर पथ्थरबाजी करी जिसमे एक छोटे बच्चा पथ्थर लगने से घायल हुआ है।
— Gopal Italia (@Gopal_Italia) November 26, 2022
27 साल मे कुछ काम कर लिया होता तो आज आम आदमी पार्टी की जनसभा मे पथ्थर फेंकने नही पड़ते।
भाजपाई पथ्थरबाजो को जनता झाड़ू से जवाब देगी। pic.twitter.com/2hCCA0TKYV
కాగా, గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలకు గానూ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు గుజరాత్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి.