యూపీలో వికటించిన గోవధ నిషేధం- విచ్చలవిడి వశువులతో పంటనష్టం- బీజేపీపై జనాగ్రహం
బీజేపీ అజెండాలో ఉన్న ప్రధానాంశాల్లో ఒకటైన గోవధ నిషేధం యూపీలో వికటించినట్లే కనిపిస్తోంది. యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అధికారంలోకి రాగానే అమలు చేసిన గోవధ నిషేధం ప్రభావం ఇప్పుడు ఎన్నికల సమయంలో కనిపిస్తోంది. గోవధ నిషేధంతో హిందువుల ఓట్ల ఏకీకరణ కోసం ప్రయత్నించిన బీజేపీకి అంతకు మించి జరిగిన నష్టం ఇప్పుడు తెలిసొస్తోంది. ముఖ్యంగా యూపీలో పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్లే కొద్దీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తాజా కథనంలో పేర్కొంది.
యూపీలో 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత యోగీ సర్కార్ గోవధ నిషేధం కోసం చట్టం చేసి కఠినంగా దీన్ని అమలు చేయడం ప్రారంభించింది. దీంతో గేదెల బెల్ట్ అయిన పశ్చిమ యూపీతో పోలిస్తే ఆవుల ప్రభావం ఎక్కువగా ఉండే తూర్పు యూపీలో రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల ప్రభావం ఎక్కువైపోయింది. ఇవి కాస్తా రైతుల పంటల్ని తినేయడం కూడా ప్రారంభించాయి. కానీ వీటిపై రైతులు కూడా తిరగబడలేని పరిస్ధితి. దీంతో ఒకప్పుడు గోవధ నిషేధం కోరుకుని బీజేపీకి ఓటేసిన వారు కాస్తా ఇప్పుడు కాషాయ పార్టీకి వ్యతిరేకంగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధులకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video
తూర్పు యూపీలో విచ్చలవిడిగే తిరిగే పశువుల జనాభా ప్రతీ జిల్లాలో,ప్రతీ నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో లక్షల సంఖ్యకు చేరుకుంది. వీటిని అడ్డుకట్టే వేసే పరిస్ధితి లేదు. గోవధపై నిషేధం ఉండంటతో కేసుల భయంతో మిన్నకుండిపోయిన రైతులు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. ముఖ్యంగా తమ పంటల్ని తినేస్తున్న విచ్చలవిడి పశువులకు కారణమైన బీజేపీపై వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా యూపీలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ కూడా ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications