• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శభాష్ షేరూ: ఈ వీధికుక్క ఓ మహిళ మానాన్ని కాపాడింది....విశ్వాసం అంటే ఏమిటో చూపింది

|

కుక్కలు విశ్వాసానికి మారుపేరంటారు. పట్టెడన్నం పెడితే అది బతికున్నంతకాలం యజమానికోసమే పనిచేస్తుంది. ఇక ఆ కుక్క చూపించే విశ్వాసం అంతా ఇంత కాదు. ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఇట్టే యజమానిని అలర్ట్ చేస్తుంది. యజమాని మీదకు ఎవరు వచ్చిన వాళ్లను తరిమికొడుతుంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో‌ కూడా ఓ మహిళ ఓ వీధికుక్కను ఎంతో ప్రేమగా చూసుకోవడంతో ఆ కుక్క మహిళ ప్రాణాలు కాపాడి రుణం తీర్చుకుంది.

పక్కింటి మహిళపై సునీల్ లైంగిక దాడి

పక్కింటి మహిళపై సునీల్ లైంగిక దాడి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ చోలా ప్రాంతంలో నివాసముంటున్న మహిళపై సునీల్ అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. సునీల్ ఆ మహిళ ఇంటి పక్కనే నివసిస్తూ ఉంటాడు. ఫుల్‌గా మద్యం సేవించి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. సునీల్‌ను నిలువరించేందుకు మహిళా చాలా ప్రయత్నించింది. అయినప్పటికీ మహిళను వదలలేదు సునీల్. తాగిన మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలం వాడాడు.

సునీల్‌పై పంజా విసిరిన షేరూ అనే వీధి కుక్క

సునీల్‌పై పంజా విసిరిన షేరూ అనే వీధి కుక్క

అదే సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో షేరూ అనే వీధికుక్క ఆమె అరుపులు విని ఇంట్లోకి పరుగులు తీసింది. ఒక్కసారిగా సునీల్‌పై పంజా విసిరింది. అతనిపై దాడి చేసింది. సునీల్‌ను ఊపిరి తీసుకోకుండా చేసింది కుక్క. ఈ క్రమంలోనే సునీల్ ఓ పదునైన కత్తితో కుక్కపై దాడి చేయడంతో కుక్క కాలి వేలుకు తీవ్ర గాయాలయ్యాయి.చివరకు కుక్క బాధకు జడుసుకుని ఇంటి నుంచి పారిపోయాడు సునీల్.

షేరూ లేకపోతే తన ప్రాణాలు దక్కేవి కాదన్న మహిళ

షేరూ లేకపోతే తన ప్రాణాలు దక్కేవి కాదన్న మహిళ

షేరూ అనే ఈ కుక్కను బాధిత మహిళ ఎంతో ప్రేమగా చూసుకునేది. దానికి వేళకు భోజనం పెట్టేది. ప్రేమను పొందిన కుక్క విశ్వాసం చూపించింది. మహిళను సునీల్ దగ్గర నుంచి కాపాడి రుణం తీర్చుకుంది. ఇక వెంటనే తేరుకున్న మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సునీల్ అనే వ్యక్తి తమ కాలనీలోనే ఉంటాడని చెప్పిన మహిళ తనపై అత్యాచారయత్నం చేశాడని చెప్పింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన షేరూ అనే కుక్కను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. షేరూ లేకపోతే తను ప్రాణాలతో బతికి ఉండేది కాదని మహిళ చెప్పింది.

పదహారేళ్ల బాలికను కాపాడిన చీమలదండు

పదహారేళ్ల బాలికను కాపాడిన చీమలదండు

ఇండోనేషియాలో కూడా టోనీ అనే వ్యక్తి పదహారేళ్ల బాలికను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాయత్నం చేశాడు. టోనీ దగ్గర నుంచి ఆ పదహారేళ్ల బాలికను చీమలు కాపాడాయి. ఆమె పై అత్యాచారయత్నం చేస్తున్న క్రమంలో చీమలు టోనీపై దాడి చేశాయి. అతని శరీరాన్ని కుట్టాయి. నొప్పి భరించలేకపోయిన టోనీ పదహారేళ్ల బాలికను వదిలి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బాలిక కూడా అక్కడి నుంచి తప్పించుకుంది. మొత్తానికి చీమలే ఆ బాలికను టోనీ నుంచి కాపాడాయి. ఇలా జంతువులే కాదు కీటకాలు కూడా కొన్ని ప్రమాదాల నుంచి మనుషులను కాపాడుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman is Bhopal was repaid for her kindness when a stray dog she feeds came to her rescue when the woman was molested by a man who broke into her house.The woman, a 29-year-old resident of Chhola area in Bhopal, was allegedly attacked by one of her neighbours, named Sunil, whom she says forced his way into her home, while in a drunken state, and attempted to sexually assault her. As she was resisting him, Sunil allegedly started hurling abuses at her, only to be attacked by the dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more