తజకిస్థాన్‌లో భూకంపం: ఉత్తరాదిలో కంపించిన భూమి
న్యూఢిల్లీ: తజకిస్థాన్‌లో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు పట్టణాలు సైతం కంపించాయి.
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప ప్రభావంతో శ్రీనగర్, చండీగఢ్ ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

తజకిస్థాన్‌లోని కారాబూల్ పట్టణానికి 111 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యుఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications