Student: 15 ఏళ్ల అమ్మాయి, 17 మంది రేప్, ఐదు నెలలు ఆంటీ అరాచకం, పాపంపండింది, ఫినిష్!
బెంగళూరు/ చిక్కమగళూరు/ శృంగేరి: అమాయకురాలైన అమ్మాయి చిన్నమ్మ ఇంటిలో ఉంటూ చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. కామాంధురాలైన చిన్నమ్మ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. 15 ఏళ్ల వయసులో 17 మంది కామాంధులు ఐదు నెలలపాటు పదేపదే ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. అమ్మాయి జీవితం సర్వనాశనం చేసిన చిన్నమ్మతో పాటు 8 మందికి పోలీసులు బెండ్ తీశారు. మిగిలిన 9 మంది నిందితుల నరాలు పీకేయాలని వారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.

తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి
కర్ణాటకలోని చిక్కమగళూరు సమీపంలో నివాసం ఉంటున్న దంపతులకు ఓ అమ్మాయి ఉంది. అమ్మాయి చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోయింది. అమ్మాయి తండ్రి వేరే పెళ్లి చేసుకుని రెండో పెళ్లాంతో జల్సాలు చెయ్యడం మొదలుపెట్టాడు. కూతురి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తండ్రి సోదరుడి ఇంటిలో 7వ తరగతి వరకు అమ్మాయి చదువుకుంది.

ఖర్మకాలి చిన్నమ్మ ఎంట్రీ
తండ్రి సోదరుడి ఇంటిలో చదువుకుంటున్న అమ్మాయి జీవితంలోకి ఆమె తల్లి చెల్లెలు ఎంట్రీ ఇచ్చింది. తనతో పాటు మా అక్క కూతురిని శృంగేరికి పిలుచుకుని వెళ్లి అక్కడే చదివించుకుంటానని ఆమె చెప్పింది. సరే అని అమ్మాయి చిన్నాన కుటుంబ సభ్యులు చెప్పారు. 8 నెలల క్రితం అమ్మాయిని ఆమె చిన్నమ్మ శృంగేరికి పిలుచుకుని వెళ్లింది.

వన్ బై వన్ కామాంధులు రేప్
చిన్నమ్మ, చిన్నాన ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న 15 ఏళ్ల అమ్మాయి మీద కామాంధుల కన్నుపడింది. అంతే ఒకరి తరువాత ఒకరు అమ్మాయి మీద ఐదు నెలల నుంచి పదేపదే అత్యాచారం చేశారు. అమ్మాయి మీద అత్యాచారం చేసే సమయంలో కొందరు కామాంధులు ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశారు.

బ్లాక్ మెయిల్ తో జీవితం నాశనం
అత్యాచారం జరిగిన విషయం బయటకు చెబితే నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, తరువాత నిన్ను రక్షించడానికి మీ అమ్మానాన్నలు కూడా లేరని, నువ్వు ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని కామాంధులు మైనర్ అమ్మాయిని బెదిరించారు. తన మీద 17 మంది అత్యాచారం చేశారని ఆ అమ్మాయి ఆమె చిన్నమ్మకు చెప్పింది.

వేశ్యవాటికలో అమ్మేస్తా జాగ్రత్త
అమ్మాయి మీద పదేపదే అత్యాచారం చేస్తున్నారని తెలిసినా ఆమె చిన్నమ్మ ఏ మాత్రం పట్టించుకోలేదు. నువ్వు ఈ విషయం బయటకు చెబితే నిన్ను వేశ్యవాటికలో అమ్మేస్తానని అమ్మాయిని ఆమె చిన్నమ్మ బెదిరించింది. అంతే కాకుండా అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్న నిందితులకు కిరాతకురాలైన చిన్నమ్మ సహకరించింది.

పాపం పండిపోయింది
బాధితురాలు కామాంధుల టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి అమ్మాయి జీవితం నాశనం చేసిన ఆమె చిన్నమ్మతో పాటు 8 మందిని అరెస్టు చేశారు. బాలిక జీవితనం నాశనం చేసిన కామాంధులైన సన్న అభి, గిరీష్, వికాస్, మణికాంత్, సంపత్, అశ్వథ్ గౌడ, రాజేష్, అమిత్, సంతోష్, నిరంజన, నయన గౌడ, అభిగౌడ, యోగీష్ అనే కామాంధులను గుర్తించామని పోలీసులు చెప్పారు.

అందరి నరాలు పిండేస్తాం
బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉండటానికి ఏర్పాట్లు చేశామని చిక్కమగళూరు జిల్లా మహిళా శిసు సంక్షేమ శాఖ సీనియర్ అధికారి సుబ్రమణి మీడియాకు చెప్పారు. బాలిక జీవితం నాశనం చేసిన కామాంధులు ఎవ్వరినీ వదిలిపెట్టమని, అందర్నీ అరెస్టు చేస్తామని చిక్కమగళూరు జిల్లా సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications