Student: కాలేజ్ లో టార్చర్, పీజీలో ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ విద్యార్థి, అమ్మకు మెసేజ్ చేసి !
బెంగళూరు/ మంగళూరు: బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని యువకుడు అనుకున్నాడు. యువకుడు కోరుకున్న ప్రకారం అతన్ని కుటుంబ సభ్యులు అతను అడిగిన కాలేజ్ లోనే చేర్పించారు. కాలేజ్ లో చదువు కుంటున్న యువకుడు పీజీలో నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువకుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. అయితే కాలేజ్ యాజమాన్యం తీరుతో తాను విసిగిపోతున్నానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

చదువు కోవడానికి బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లాడు
బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లో భరత్ భాస్కర్ అలియాస్ భరత్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని భరత్ అనుకున్నాడు. యువకుడు కోరుకున్న ప్రకారం అతన్ని కుటుంబ సభ్యులు అతను అడిగిన మంగళూరులో ని కరావలి కాలేజ్ లోనే చేర్పించారు.

కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య
మంగళూరులోని కోట్వారా లోని పీజీలో భరత్ నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో చదువు కుంటున్న భరత్ పీజీలో నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న భరత్ బెంగళూరులో ఉంటున్న అతని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. అయితే కాలేజ్ యాజమాన్యం తీరుతో తాను విసిగిపోతున్నానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన భరత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Recommended Video


డబ్బు కోసం కాలేజ్ యాజమాన్యం పీడిస్తోంది
మా కాలేజ్ లో నిత్యం టార్చర్ పెడుతున్నారని, లక్షలు లక్షలు డోనేషన్లు తీసుకున్నారని, సరైన అధ్యాపకులు లేరని, ఏమైనా అడిగితే తనను చితకబాదుతున్నారని భరత్ బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులకు మెసేజ్ పంపించారు. ఇటీవల ప్రాజెక్టు రిపోర్టు సక్రమంగా లేదని, డోనేషన్ ఇస్తే పాస్ చేస్తామని అంటున్నారని, వీళ్లను తాను భరించలేకపోతున్నానని, అమ్మా, నాన్నా నన్ను క్షమించిండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ చేసిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భరత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కాలేజ్ యాజమాన్యం మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications