డిప్రెషన్: బొంబాయి ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి

ముంబై: బొంబాయి ఐఐటీ క్యాంపస్‌లో కెమికల్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న ఓ విద్యార్థి హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అధికారులు ఇది ఆత్మహత్యేనని భావిస్తున్నారు.

రోహ్‌తక్‌కు చెందిన 21 ఏళ్ల జితేశ్‌శర్మ శనివారం రాత్రి హాస్టల్ పైభాగంలో చనిపోయి పడివున్నాడు. విద్యార్థి మృతదేహం వద్ద సుసైడ్‌నోట్ లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

కాగా, జితేశ్ మృతదేహం వద్ద లభించిన లేఖలో.. తనకు ఇష్టంలేని కోర్సులో చేరి, అందులో రాణించలేక మానసిక ఒత్తిడి(డిప్రెషన్‌)కు గురై చనిపోతున్నట్లు రాశాడని పోలీసులు తెలిపారు. హాస్టల్ టెర్రాస్‌పైన విద్యార్థి మృతదేహం లభించిందని చెప్పారు.

Student of IIT Bombay Found Dead in Campus. Case of Suicide, Say Sources

విషం తాగి ఆత్మహత్య చేసుకన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘నాకు ఈ ఫీల్డ్‌లోకి రావాలని లేదు. జెఈ పాసై నేను తప్పు చేశాను. నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చింది' అని సూసైడ్ నోట్‌లో విద్యార్థి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల జరిగిన పరీక్షల్లో కూడా జితేష్ శర్మ ఫెయిలయ్యాడని చెప్పారు. మానసికంగా ఒత్తిడికి గురవుతున్న విషయం అతని తల్లిదండ్రులకు కూడా తెలుసని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+