ఇదేంది: యడ్డీని తొలగించడమా..? పార్టీ అధికారంలోకి వచ్చిందే.. సుబ్రమణ్య స్వామి
కర్ణాటకలో సీఎం మార్పు ఖాయం అనిపిస్తోంది. యడియూరప్పను మార్చాలని బీజేపీ హై కమాండ్ అనుకుంటుంది. ఆ దిశగా కసరత్తు కూడా జరుగుతుంది. అయితే సీఎం మార్పు అంశంపై వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది యడియూరప్పే.. ఆయనకు పదవీ నుంచి తొలగించడంపై వ్యతిరేకత వస్తోంది. అయితే ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి కూడా అడ్డం తిరిగారు. బీజేపీ హైకమాండ్ తీరును తప్పుపట్టారు.

యడ్డీకి మద్దతు
సుబ్రమణ్య స్వామి అంటేనే వ్యతిరేకత. ధిక్కార స్వరం.. యడియూరప్పను సీఎంగా తొలగిస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది యడియూరప్ప అని చెప్పారు. ఆయనపై కొన్ని అభియోగాలు ఉన్నప్పటికీ.. అతను ఎప్పుడూ ఎవరికీ చంచాలా వ్యవహరించలేదని చెప్పారు. అతను లేకుంటే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదన్నారు.

మళ్లీ అదే తప్పిదాలు
అంతేకాదు మరొసారి అధికారంలోకి రావాలన్న యడియూరప్పే సీఎంగా ఉండాలని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ అలాంటి తప్పిదాలనే ఎందుకు చేస్తారని ఆయన ట్వీట్ చేశారు. యడియూరప్పను సీఎం పదవీ నుంచి తొలగిస్తారనే ప్రచారంతో లింగాయత్‌లు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు.

రెండేళ్లు పూర్తి
ఈ నెల 26వ తేదీన యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కానున్నాయి. 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు యడియూరప్ప భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. వారం రోజులుగా ప్రచారంలో ఉంది. హఠాత్తుగా ఈ విందుకు బ్రేక్ పడింది. విందు, వినోదాలు వంటివి ఏమీ లేవని తాజాగా ప్రకటన జారీ చేశారు. 26న సోమవారం రెండేళ్ల పాలనపై 'సాధన' పేరిట కార్యక్రమం నిర్వహిస్తారట.. విధాన సౌధలోని బ్యాంకెట్‌హాల్‌లో సాదాసీదాగానే జరుగుతుందని చీఫ్ విప్ సునీల్‌కుమార్ మీడియాకు తెలిపారు.
Recommended Video

హైకమాండ్ నుంచి పిలుపు
మంత్రి శ్రీరాములుకు అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపువచ్చింది. ఈ నెల 26 తర్వాత సీఎం మార్పు తప్పదనే సంకేతాలు వెలువడుతుండడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎలాంటి పిలుపు లేకుండానే హస్తినబాట పట్టారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మంత్రి జగదీశ్ శెట్టర్ అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య ఢిల్లీ బయల్దేరారు. దీంతో సీఎం మార్పు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications