టీటీడీ వివాదంపై జులై 19న సుప్రీంకోర్టులో సుబ్రమణ్యస్వామి పిటిషన్
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో నగల మాయం, తవ్వకాలు, ప్రధాన అర్చకులు రమణదీక్షితుల తొలగింపు లాంటి అంశాలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. జులై 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
టీటీడీలో ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందిన గతంలో వ్యాఖ్యానించారు.

Recommended Video

రమణదీక్షితులు సవాల్: నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా?
గత కొంత కాలంగా టీటీడీలో అత్యంత విలువైన వజ్రం కనిపించడం లేదని, పోటులో రహస్యంగా తవ్వకాలు జరిపారని అర్చకులు రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications