నీట్ ఇప్పుడే వద్దు.. సుబ్రమణ్యస్వామి ట్వీట్, ఆ వర్గం వారికే మేలు, మరీ పేదలు..

నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెక్స్ టెస్ట్ (నీట్) పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించడంతో దుమారం రేగింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు, విద్యార్థుల పేరంట్స్ కోరుతున్నారు. తాజాగా ఆ జాబితాలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా చేరిపోయారు. నీట్ పరీక్ష నిర్వహణపై పునరాలోచించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

వచ్చేనెల 13వ తేదీన నీట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో విద్యార్థులు/ పేరంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ.. నీట్ పరీక్షకోసం ప్రధాన నగరాల్లో గల ధనికుల పిల్లలకు మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. వారు ఇంట్లో కూర్చొని, చదువుకున్నారని తెలిపారు. మరి పేదల సంగతి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి పిల్లలు ఇంటర్నెట్ సదుపాయం లేదని గుర్తుచేశారు. లైబ్రరీలకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. ఈ క్రమంలో ఉన్నత వర్గాల పిల్లలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష నిర్వహించడం మంచి పద్దతి కాదన్నారు.

subramanian swamy opposed to conduct neet exam

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది. కానీ నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయించడానికి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి ముఖ్యమంత్రుల వైపు నుంచి నరుక్కుని వచ్చే ప్రయత్నాలను చేపట్టింది. దీనికోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా బరిలోకి దిగారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి తనవంతు ప్రయత్నాలను ఆరంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+