శశికళని తమిళనాడు తరలించాలి: స్వామి, పన్నీరే సీఎంగా ఉండాలని..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కర్నాటక నుంచి తమిళనాడులోని జైలుకు తరలించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కర్నాటక నుంచి తమిళనాడులోని జైలుకు తరలించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.
భద్రత కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడు కారాగారానికి మార్చాలన్నారు. దీనికి సంబంధించి శశికళ తరఫున న్యాయవాదులు రెండు రోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సూచన కూడా చేశారు.
పళనిస్వామి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరో ట్వీట్‌లో తన పేరుకు పళనిస్వామి అనే అర్థం కూడా తమిళంలో ఉందని చెప్పడం గమనార్హం.

పన్నీరే సీఎంగా కొనసాగాలి
పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దిండుక్కల్ జిల్లాకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త సుందరమూర్తి పట్టివీరన్‌పట్టి బస్టాండ్ సమీపంలో ఓ సెల్‌ఫోన్ టవర్ ఎక్కి పన్నీర్‌కు మద్దతుగా నినాదాలు చేశాడు.
పన్నీర్ మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిమాండ్ చేశాడు. అందుకు భిన్నంగా జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతను కిందకు దిగేలా చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications