సుబ్రమణ్యస్వామి కలకలం-నెహ్రూ,వాజ్ పేయ్ మూర్ఖత్వం-మత్తులో మోడీ-చైనా చేతికి టిబెట్, తైవాన్
నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇవాళ మరో కలకలం రేపారు. చైనాతో భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దానికి మరింత ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మాజీ ప్రధానుల కారణంగానే చైనా చేతుల్లోకి టిబెట్, తైవాన్ వెళ్లాయన్నారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మరో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత సుబ్రమణ్యస్వామి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి తమ మూర్ఖత్వంతో టిబెట్, తైవాన్ చైనాలో భాగమని భారతీయులు అంగీకరించారని అన్నారని ఆరోపించారు. ఇప్పుడు చైనా పరస్పరం అంగీకరించిన వాస్తవాధీన రేఖను కూడా గౌరవించదని, లడఖ్‌లోని కొన్ని భాగాలను లాక్కుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై మరింత విరుచుకుపడిన సుబ్రమణ్య స్వామి, చైనా "లడఖ్‌లోని కొన్ని భాగాలను లాక్కుంది, అయితే మోడీ "కోయి అయా నహిన్" అంటూ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

నెహ్రూ, వాజ్ పేయ్ మూర్ఖత్వం కారణంగా టిబెట్, తైవాన్ చైనాలో భాగమని భారతీయులం అంగీకరించామమని, కానీ ఇప్పుడు చైనా పరస్పరం అంగీకరించిన వాస్తవాధీన రేఖను కూడా గౌరవించడం లేదన్నారు. "కోయి అయా నహిన్" అని మోడీ మత్తులో ఉన్నప్పుడు లడఖ్‌లోని కొన్ని భాగాలను లాక్కుందన్నారు. మనకు ఎన్నికలు ఉన్నాయని చైనా తెలుసుకోవాలని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.
చైనా పదేపదే 'హెచ్చరికలు' చేసినప్పటికీ యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ను సందర్శించిన నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి చేసిన ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది.
We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide .
— Subramanian Swamy (@Swamy39) August 3, 2022
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications