ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై రూ.1.50 పెంపు
న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలను ఎత్తివేయాలన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ఆయల్ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.2018 మార్చికల్లా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్రం యోచిస్తోంది.
కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల రాయితీ సిలిండర్‌పై రూ.1.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం తెలిపింది. విమానాల్లో వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరల్ని కిలోలీటర్‌కు రూ.3,025 (దాదాపు 6%) పెంచుతున్నట్లు పేర్కొంది. సబ్సిడీయేతర సిలిండర్‌పైనా రూ.1.50 పెంచుతున్నట్లు తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో మార్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐవోసీ స్పష్టం చేసింది. గత ఆగస్టు 1న సిలిండర్‌పై రూ.2.30 పెంచిన కంపెనీలు సెప్టెంబర్‌లో ఏకంగా రూ.7 పెంచాయి.
2016 జూన్‌లో ఢిల్లీలో రూ.419.18గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ.69.50 పెరిగి ప్రస్తుతం రూ.488.68కి చేరుకుంది. ప్రతినెలా 1న గత మాసంలో నమోదైన సగటు చమురు ధర, విదేశీమారక ద్రవ్య రేటు ఆధారంగా ఎల్పీజీ, ఏటీఎఫ్ ధరలను కంపెనీలు సవరిస్తున్నాయి.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications