వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుదర్శన్ టీవీ కేసు: ఒక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకోవద్దంటూ మీడియాకు సుప్రీంకోర్టు వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసులలో ముస్లింల ప్రవేశంపై సుదర్శన్ టీవీ తన కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా ఆపడానికి ఇచ్చిన ఉత్తర్వును "అణు క్షిపణి" గా సుప్రీంకోర్టు శుక్రవారం అభివర్ణించింది. అటువంటి ఉత్తర్వు వల్ల కలిగే ప్రమాదాల గురించి కోర్టు జాగ్రత్త వహించిందని జస్టిస్ డి.వై.చంద్రచుడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 న్యాయస్థానాలు ఉన్నందున ఇది మామూలుగా చేయవచ్చని తెలిపింది.

ఎవరూ ముందుకు రానికారణంగానే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని న్యాయమూర్తులు జస్టిస్ ఇందు మల్హోత్రా, కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్(ఎన్‌బీఏ) ఈ కార్యక్రమంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఎలక్ట్రానిక్ మీడియా స్వీయ నియంత్రణా విధానంను మరింత బలపరిచేందుకు సూచనలు చేయాలని కేంద్రం, ఎన్‌బీఏను కోరింది.

Sudarshan TV case: SC Says Staying Broadcast was a Nuclear Missile, Warns Media against Targeting One Community

ఒక కమ్యూనిటీ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని ఏ మీడియా అయినా ప్రసారాలు చేస్తుందా? అలా వాటికి అనుమతి ఉంటుందా? అని సుప్రీం ప్రశ్నించింది. ముస్లింలు సివిల్ సర్వీసులలో చేరడానని మీరు లోతైన కుట్రగా భావిస్తున్నారా? అని సుదర్శన్ టీవీ యాజమాన్యాన్ని కోర్టు నిలదీసింది.

Recommended Video

Rakul Preet Singh Plea : ప్రసారభారతికి, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!! || Oneindia

మీకు(సుదర్శన్ టీవీ) ఇచ్చిన స్వేచ్ఛ ఇక్కడ ద్వేషంగా మార్చుతున్నారు.. ఒక కమ్యూనిటీలోని అందర్నీ మీరు ఎలా బ్రాండ్ చేస్తారు? ఇది మంచి సభ్యులను కూడా దూరం చేసేలా ఉంది అని కోర్టు అభిప్రాయపడింది. ఒక కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని ప్రసారాలు చేయడం సరికాదంటూ దేశంలోని మీడియా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి కథనాలు ప్రసారం చేసి మీడియా మనుగడ సాగించలేదని స్పష్టం చేసింది. తాము న్యాయ వ్యవస్థలమని, మానవ గౌరవాన్ని కాపాడటం తమ బాధ్యత అని వ్యాఖ్యానించింది.

English summary
The Supreme Court on Friday described as a "nuclear missile" its order to stop Sudarshan TV from airing its show on the entry of Muslims in civil services. A bench headed by Justice DY Chandrachud said the court was mindful of the dangers such an order could pose, given the fact that there are 700 courts across the country which may then do this routinely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X