సుజాత రెడ్డి, అజిత్ స్కెచ్, కార్పోరేట్, ఐటీ కంపెనీ ఉద్యోగులు టార్గెట్, బెంగళూరు !

ట్రోలెక్స్ కంపెనీ ద్వారా ఇల్లు లీజుకు లభిస్తుందని ప్రచారం చేసి లీజుకు వచ్చిన వారిని మోసం చేస్తున్న కిలాడి జంటను బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాకు చెందిన సుజాత రెడ్డి, అజిత్‌ రెడ్డి అలియాస్ అజిత్ అనే దంపతులను అరెస్టు చేశామని బెంగళూరు గ్రామీణ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

బెంగళూరు నగర శివార్లలోని అనేకల్ పరిసర ప్రాంతాల్లోని ఇండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ తో పాటు పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది, ఫ్యాక్టరీలు, పలు కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఆనేకల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీబీహెచ్‌సీ గ్రూపు ఇళ్లలో సుజాత రెడ్డి పేరు మీద రెండు ఇండ్లు, ఆమె చెల్లెలు గీతారెడ్డి పేరు మీద ఒక ఇల్లు ఉన్నాయి. ఈ ఇళ్లపై సుజాత రెడ్డి, గీతారెడ్డి బొమ్మనహళ్లిలోని ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు.

Sujatha Reddy and Ajith are the couple who cheated the employees to lease the house in Bengaluru

బ్యాంకులో తీసుకున్న లోన్ తో పాటు దాని అసలు, వడ్డీ, ఓడీ, చెక్కు తదితర ఖర్చులు భారీ మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయి. డబ్బు కోసం సుజాత రెడ్డి, అజిత్ దంపతులకు రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలు తీసుకుని ఇతరులకు లీజ్ కు ఇల్లు ఇస్తున్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన బయోకాన్ ఉద్యోగి లక్ష్మి అనే మహిళ సుజాత రెడ్డి ఇంటిని లీజ్ కు తీసుకున్నారు. కేవలం మూడు నెలల క్రితమే సుజాత రెడ్డి ఇంటిని లక్ష్మి కుటుంబ సభ్యులు రూ 6 లక్షలకు లీజ్ కు తీసుకున్నారు.

అయితే ఇటీవల మేము బ్యాంకు నుంచి వస్తున్నామని, ఈ ఇంటి మీద భారీ మొత్తంలో లోన్ ఉందని, అందుకే మీరు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి లక్ష్మిని బెదిరించారు. మేము ఇంటికి వచ్చి కేవలం మూడు నెలలలే అయ్యిందని లక్ష్మి చెప్పింది. అయితే మేము ఒప్పుకోమని, ఇల్లు వెంటనే ఖాళీ చెయ్యాలని బ్యాంకు ఉద్యోగులు అని చెప్పిన కొందరు లక్ష్మీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరించారు. మేము ఇల్లు ఖాళీ చేస్తామని డబ్బు తిరిగి ఇవ్వాలని లక్ష్మి ఇంటి యజమాని సుజాత రెడ్డిని కోరింది.

డబ్బులు తిరిగి ఇచ్చేందుకు కొంత సమయం ఇవ్వాలని సుజాత రెడ్డి ఇల్లు లీజుకు తీసుకున్న లక్ష్మీకి చెప్పింది. తరువాత, బంధువులు రావాలని, మా వ్యాపారంలో డబ్బులు పోయాయని సుజాత రెడ్డి, అజిత్ దంపతులు కొంతకాలం లక్ష్మీకి డబ్బులు ఇవ్వకుండా వేధించారని తెలిసింది. డబ్బులు ఇవ్వాలని నువ్వు గట్టిగా అడిగితే ఇవ్వలేమని, నువ్వు ఎదురు తిరిగితే మేము ఏం చెయ్యాలో అది చేస్తామని సుజాత రెడ్డి, అజిత్ దంపదతులు బయోకాన్ లో ఉద్యోగం చేస్తున్న లక్ష్మీని బెదిరించారు.

Sujatha Reddy and Ajith are the couple who cheated the employees to lease the house in Bengaluru

లక్ష్మి ఆనేకల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుజాత రెడ్డి, అజిత్ దంపతుల అక్రమ లావాదేవీల వ్యవహారం బట్టబయలు అయ్యింది. సుజాత రెడ్డి, అజిత్ దంపతులు చాలా మందిని ఈ విధంగా మోసం చేశారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఇప్పటి వరకు సుజాత రెడ్డి, అజిత్ దంపతులు రూ 50 లక్షలకు పైగా ఇతరులకు మోసం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అదే విదంగా
సూర్యనగర్ సమీపంలో ట్రాలెక్స్ దుకాణం తెరిచి భవన యజమాని నుంచి డబ్బులు తీసుకుని తరువాత సుజాత రెడ్డి, అజిత్ లు పేర్లు మార్చుకుని వారిని మోసం చేశారని ఆనేకల్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+