రాహుల్- ప్రియాంక గాంధీ స్పెషల్ గెస్ట్‌గా..!!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపింది. గుజరాత్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిన హస్తం పార్టీ హిమాచల్‌లో విజృంభించింది. భారతీయ జనత పార్టీని మట్టి కరిపించింది. క్లీన్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోని కాంగ్రెస్ పార్టీ- ఇక్కడ మాత్రం తిరుగులేని మెజారిటీని సాధించింది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 35. ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకుంది కాంగ్రెస్. మొత్తం 40 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో కూర్చోనుంది. ఈ ఓటమితో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

ఇక హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణం నామినేట్ అయ్యారు. సుఖ్వీందర్‌తో పాటు ఆయనా ప్రమాణం చేశారు. దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గాన్ని సమావేశపరుస్తానని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని సుఖ్వీందర్ చెప్పారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఈ దిశగా చర్యలు తీసుకుంటానని అన్నారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ గతంలో బీజేపీ ప్రచారం చేసిందని, ఆ చరిత్రను తిరగ రాశామని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, ఆనంద్ శర్మ ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి రాహుల్ గాంధీ- తన భారత్ జోడో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ప్రమాణ స్వీకార సమయంలో రాహుల్-ప్రియాంక గాంధీ జోష్‌లో కనిపించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications