సునంద కేసులో మరో ట్విస్ట్: రెండు రోజుల ముందు విజిటర్
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సునంద పుష్కర్ మృతికి రెండు రోజుల ముందు ఆమె ఉంటున్న లీలా ప్యాలెస్ హోటల్ గదికి ఓ వ్యక్తి వచ్చినట్లు శశి థరూర్ పనిమనిషి నారాయణ్ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వచ్చిన వ్యక్తి పేరును కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఆ వ్యక్తి ట్వీట్ చేయడానికి, కొన్ని మెసేజ్‌లను కాపీ చేయడానికి సహకరించినట్లు చెబుతున్నారు.
నారాయణ్ చెప్పాడంటూ టైమ్స్ ఇండియా ఈ విధంగా రాసింది. తాను ప్రతి విషయాన్ని మీడియాకు చెప్పేస్తున్నానని, ఇక నీ పని అయిపోయిందని సునంద పుష్కర్ శశి థరూర్‌కు చెప్పినట్లు నారాయణ్ దర్యాప్తు అధికారులకు చెప్పాడు. హిందీలో ఇచ్చిన అతని వాంగ్మూలం ప్రతి తమ వద్ద ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పుకుంది.

శశి థరూర్, సునంద పుష్కర్ దంపతులకు అతను చివరి రోజుల్లో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. దాంతో దర్యాప్తులో అతను ప్రధానమైన వ్యక్తిగా మారాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని అతని ఇంటి నుంచి నారాయణ్‌ను పిలిపించి సిట్ అధికారులు గురువారంనాడు ప్రశ్నించారు.
నవంబర్ మొదటివారంలో నారాయణ్‌ను పోలీసులు విస్తృత స్థాయిలో ప్రశ్నించారు. జనవరి 16, 17 తేదీల్లో చోటు చేసుకున్న సంఘటనలను అతను వివరించాడు. దుబాయ్‌లో శశి థరూర్, సునంద పుష్కర్ కొట్లాడుకున్న విషయాన్ని కూడా చెప్పాడు.












Click it and Unblock the Notifications