రేపు హస్తినకు జగన్, మోదీతో భేటీ
హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం జగన్ ప్రధానిని కలుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు.

విభజన సమస్యలపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, కేంద్రం సాయం చేయాలని జగన్ కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే జగన్‌కు నివేదించారు. రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో జగన్ భేటీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications