వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ అరోరా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (సీఈసీ) సునీల్ అరోరా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన వయస్సు 62. సునీల్‌ను సీఈసీగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. ఓపీ రావత్‌ పదవీకాలం ముగియడంతో గత మంగళవారం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

2019 సాధారణ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు కూడా ఈయన నేతృత్వంలో జరుగుతాయి. ఇంతకు ముందు నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌ మంత్రిత్వశాఖలో సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ సెక్రటరీగా ఆయన పని చేశారు.

Sunil Arora, Who Will Oversee National Polls, Takes Charge As CEC

1980 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ కేడర్‌ వ్యక్తి. ఇప్పటికే ఈయన ఆర్థిక, జౌళి, ప్రణాళిక సంఘం వంటి విభాగాల్లో కీలక బాధ్యతల్లో పని చేశారు. 1999 నుంచి 2002 పౌరవిమానయాన శాఖ జాయింట్‌ సెక్రటరీగా ఉన్నారు. సీఈసీగా సునీల్‌ ఆరేళ్ల పాటు కొనసాగుతారు.

English summary
Sunil Arora, who was appointed as the new Chief Election Commissioner by President Ram Nath Kovind, has taken charge today. He succeeds OP Rawat, who demitted office on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X